పాట చిత్రీకరణలో నాగచైతన్య చిత్రం
- IndiaGlitz, [Thursday,May 31 2018]
.యంగ్ హీరో నాగచైతన్య, కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు' (ప్రచారంలో ఉన్న పేరు). మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చైతు కారు డ్రైవర్‌గా, ప్రైవేటు డిటెక్టివ్‌గా రెండు షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. పగలంతా కార్ డ్రైవర్‌గా పనిచేసే చైతు.. నైట్ మాత్రం ప్రైవేటు డిటెక్టివ్ అవతారం ఎత్తనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో నైట్ టైమ్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
అలాగే.. చైతు, అను, ఇతర తారాగణంపై ఫ్యామిలీ సాంగ్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నేతృత్వంలో షూట్ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ పాట పూర్తవనుండగా.. ఆపై కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంతో పాటు చైతు 'సవ్యసాచి' సినిమా కోసం కూడా సమాంతరంగా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ కోసం చైతు అదనపు కాల్ షీట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.