ఫ్యాన్సీ ఆఫర్ దక్కించుకున్న చైతు చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
`ప్రేమమ్` వంటి విజయవంతమైన చిత్రం తరువాత యువ కథానాయకుడు నాగచైతన్య, యువ దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. `సవ్యసాచి` పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో భూమికా చావ్లా, మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు.
ఓ పాట మినహా ఆగస్ట్ 8 నాటికి చిత్రీకరణంతా పూర్తి చేసుకుంటుంది. ఆ మిగిలిన పాటను కూడా విదేశాల్లో ఆగస్ట్ 15 కల్లా చిత్రీకరించేస్తారట. సెప్టెంబర్ 15 కంతా గ్రాఫిక్స్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 9.5 కోట్లకు అమ్ముడైపోయాయట. కర్ణాటక హక్కులు కూడా అమ్ముడైపోయాయట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com