రెండు షేడ్స్ ఉన్న పాత్రలో చైతు?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో నాగచైతన్య, కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’ (ప్రచారంలో ఉన్న పేరు). మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో చైతుపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది చిత్ర బృందం.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చైతు కారు డ్రైవర్‌గా, ప్రైవేటు డిటెక్టివ్‌గా రెండు భిన్నమైన ఛాయలున్న పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. హీరోయిన్ సమస్యను పరిష్కరించే దిశగా ఈ కథ సాగుతుందట. చైతు కెరీర్లో ఇప్పటి వరకు చేయని పాత్రను ఈ సినిమాలో చేస్తున్నారనీ.. దాన్ని చాలా వైవిధ్యంగా దర్శకుడు మలుస్తున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. కాగా.. ఈ సినిమాని ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు.. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో నటించిన ‘సవ్యసాచి’ జూన్ 15న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout