రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో చైతు?

  • IndiaGlitz, [Friday,April 13 2018]

యంగ్ హీరో నాగచైతన్య, కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’ (ప్రచారంలో ఉన్న పేరు). మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో చైతుపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది చిత్ర బృందం.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చైతు కారు డ్రైవర్‌గా, ప్రైవేటు డిటెక్టివ్‌గా రెండు భిన్నమైన ఛాయ‌లున్న‌ పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. హీరోయిన్ సమస్యను పరిష్కరించే దిశగా ఈ కథ సాగుతుందట. చైతు కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని పాత్రను ఈ సినిమాలో చేస్తున్నారనీ.. దాన్ని చాలా వైవిధ్యంగా దర్శకుడు మలుస్తున్నారని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. కాగా.. ఈ సినిమాని ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రో వైపు.. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో నటించిన ‘సవ్యసాచి’ జూన్ 15న విడుదల కానుంది.

More News

'యాత్ర' లో విజ‌య‌మ్మ‌గా ర‌మ్య‌కృష్ణ‌?

సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత డా.రాజశేఖర్ రెడ్డి జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

నిర్మాతగా మారబోతున్న సదా

‘జయం’ చిత్రంతో ఆకట్టుకున్న ఉత్తరాది భామ సదా నిర్మాతగా మారనున్నారా?

ప‌ల్లెటూరి అమ్మాయిగా...

శ‌ర్వానంద్‌, సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

ప్రభాస్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘సాహో’ సుజీత్ దర్శకత్వంలో

పొలిటికల్‌ టచ్‌తో సాగే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ 'భరత్‌ అనే నేను'- కొరటాల శివ

'శ్రీమంతుడు' వంటి ఇండ్రస్టీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందించిన సూపర్‌స్టార్‌ మహేశ్‌ సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం 'భరత్‌ అనే నేను'.