చైతు మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. తెలుగు, తమిళ్ లో ఈ చిత్రం రూపొందుతుంది. తెలుగులో నాగ చైతన్య హీరోగా నటిస్తుంటే..తమిళ్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ తెలుగు, తమిళ్ రెండు వెర్షెన్స్ లో హీరోయిన్ గా మంజిమ మోహన్ నటిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని స్టార్ రైటర్ కోన వెంకట్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే...ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఏమిటంటే...ఈ చిత్రంలో నాగ చైతన్య పోలీస్. అవును ఇది నిజంగా నిజం. ఇప్పటి వరకు చైతన్య పోలీస్ గా నటించలేదు. ఫస్ట్ టైమ్ చైతన్య పోలీస్ గా నటిస్తుండడం విశేషం. ఇటీవల చెన్నైలో చైతన్య పోలీస్ గెటప్ లో ఉండే సీన్స్ ను చిత్రీకరించారని సమాచారం. పోలీస్ గెటప్ లో చైతు లుక్ అదిరింది అనేలా ఉంది. అయితే... పోలీస్ గా చైతు ఈమూవీలో ఏం చేసాడనేది ఎవరూ ఊహించని విధంగా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలో ఆడియో రిలీజ్ చేసి...జూన్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments