నాగ చైతన్య.. ఈ ఏడాదంతా బిజీగానే..
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు అక్కినేని వారి నట వారసుడు నాగచైతన్య. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి`, దాసరి మారుతి డైరెక్షన్‌లో శైలజా రెడ్డి అల్లుడు` (ప్రచారంలో ఉన్న పేరు) చిత్రాల్లో నటిస్తున్నారు చైతు. సవ్యసాచి` షూటింగ్ మే నెల కల్లా పూర్తికాబోతుండగా.. ఆగష్టు నెలాఖరుకి శైలజా రెడ్డి అల్లుడు` కంప్లీట్ కానుందని సమాచారం. ఇదిలా ఉంటే.. ఇటీవల నిన్నుకోరి` డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు కూడా ప్రకటించేశారు చైతు. ఈ మూవీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో పట్టాలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా కోసం తన శ్రీమతి సమంతతో కలిసి మరోసారి తెరను పంచుకోనున్నారు చైతన్య. అంతేగాకుండా.. ఓ కొత్త దర్శకుడితో తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనున్న చిత్రంలో కూడా ఈ యంగ్ హీరో నటించబోతున్నట్టు తెలిసింది. ఇది ఈ సంవత్సరాంతంలో సెట్స్ పైకి వెళ్లనుందన్నది ఇన్‌సైడ్ సోర్స్ టాక్. వీటితో పాటు మహానటి` సినిమాలో తాత అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కూడా నటించనున్నారు చైతు. మొత్తమ్మీద.. వరుస సినిమాలతో ఈ ఏడాదంతా నాగచైతన్య ఫుల్ బిజీగా ఉండబోతున్నారన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com