పెళ్ళి డేట్ అనౌన్స్ చేసిన చైతు
Send us your feedback to audioarticles@vaarta.com
చైతన్య ఫిలింఫేర్ అవార్డ్స్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. 2017 ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ జూన్ 17న హైదరాబాద్‌లో జరగనుంది. ఫిలింఫేర్ అవార్డ్ నటుడిగా నాకు స్ఫూరినిచ్చిందని అన్నాడు. ఇదే వేదికపై పెళ్ళి డేట్ గురించి అక్టోబర్ 6న సమంతను పెళ్ళి చేసుకోనునట్లు చైతు పెళ్ళి తేదినీ ఖరారు చేశాడు.
అలాగే సమంతతో కలిసి ఓ ప్రేమకథా చిత్రం చేయాలని ఉందని, మంచి కథ కుదిరితే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో తప్పకుండా చేస్తానని అన్నారు. ఈసారి ఉత్తమ హీరోల కేటగిరీలో ఊపిరి(నాగార్జున), నాన్నకు ప్రేమతో(ఎన్టీఆర్), ధృవ(రామ్‌చరణ్), ప్రేమమ్(నాగచైతన్య)లు రేస్‌లో ఉన్నారు. తండ్రి కొడుకుల్లో ఎవరినైనా ఒకరిని వరిస్తుందో లేక మరెవరినైనా అవార్డు వరిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments