నాగ‌చైత‌న్య‌, స‌మంత‌..నో సీన్స్‌?

  • IndiaGlitz, [Wednesday,April 25 2018]

నాగ‌చైత‌న్య‌, స‌మంత.. ఆన్ ద‌ స్క్రీన్ మాత్ర‌మే కాదు.. ఆఫ్ ద‌ స్క్రీన్ కూడా మంచి జోడీ అనిపించుకున్నారు. ఏమాయ చేసావె చిత్రంతో మొద‌లైన వీరి కాంబినేష‌న్‌.. మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య చిత్రాల‌తోనూ అల‌రించింది. ఇటీవ‌లే నిజ‌జీవితంలోనూ దంప‌తులైన ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో సినిమా రానుంది. నిన్ను కోరి ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఆ సినిమా విడుద‌ల‌య్యేలోపే మ‌రో సినిమాలో ఈ ఇద్ద‌రూ క‌నిపించ‌నున్నారు.

అయితే.. ఆ సినిమాలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ సీన్స్ మాత్రం ఉండ‌వు. ఇంత‌కీ ఆ సినిమా ఏమిటంటే.. మ‌హాన‌టి. ఈ సినిమాలో సావిత్రి జీవితాన్ని ప్రేక్ష‌కుల‌కు చెప్పే జ‌ర్న‌లిస్ట్ మ‌ధుర‌వాణిగా స‌మంత సంద‌డి చేయ‌నుండ‌గా.. ఏఎన్నార్ పాత్ర‌లో కాసేపు త‌ళుక్కున మెరిసే గెస్ట్ రోల్‌లో చైతు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. అయితే.. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మాత్రం సీన్స్ ఉండ‌వ‌ని తెలుస్తోంది. కీర్తి సురేష్ టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ చిత్రానికి నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ‌చ్చే నెల 9న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.