నాగ్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసిన చైతు & అఖిల్..!

  • IndiaGlitz, [Monday,August 29 2016]
టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పోస్ట‌ల్ స్టాంప్ ను నాగార్జున వార‌సులు అఖిల్ & చైత‌న్య లాంచ్ చేసారు. అనంత‌రం చైత‌న్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాగార్జున ఫ్యాన్స్ ప్రెసిడెంట్ స‌ర్వేశ్వ‌ర‌రావుకు స్టాంప్ ను అంద‌చేయ‌గా, అఖిల్ తెలంగాణ నాగార్జున ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ర‌వీంద‌ర్ రెడ్డికి అంద‌చేసారు.
ఈ సంద‌ర్భంగా చైత‌న్య మాట్లాడుతూ....నాన్న పుట్టిన‌రోజు నాడు ఈ స్టాంప్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. శివ‌, గీతాంజ‌లి సినిమాల‌తో ఓ ట్రెండ్ క్రియేట్ చేసారు. ఆత‌ర్వాత నిన్నే పెళ్లాడ‌తా, మ‌నం, సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఊపిరి, మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు....ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు నాన్న కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తునే ఉన్నారు. మా వ‌య‌సులో మేము ఎలాంటి పాత్ర‌లు చేయాలో....నాన్న చేసి చూపించారు. ఇప్ప‌టికీ కొత్త‌గా చేస్తూనే ఉన్నారు. నాకు నాన్నే ఇన్ స్పిరేష‌న్. తాత గారు జ‌ర్నీ స్టార్ట్ చేస్తే...నాన్న గారు కంటిన్యూ చేస్తున్నారు. మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ఆద‌రిస్తున్న అభిమానులంద‌రికీ థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.
అఖిల్ మాట్లాడుతూ...పుట్టిన‌రోజు నాడు నాన్న పేరుతో స్టాంప్ రిలీజ్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. నాన్న‌తో మంచి పాట పాడించినందుకు రోష‌న్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. మా అంద‌రికీ ఇన్ స్పిరేష‌న్ నాన్న‌. మేము చేయాల‌నుకున్న‌వి నాన్నే చేసేస్తున్నారు అంటూ సంతోషాన్ని పంచుకున్నారు.
సంగీత ద‌ర్శ‌కుడు రోష‌న్ మాట్లాడుతూ...నిర్మ‌లా కాన్వెంట్ లో నాగార్జున గారు పాడిన పాట‌కు విశేష స్పంద‌న ల‌భిస్తుండ‌డం ఆనందంగా ఉంది. నాగార్జున గారితో పాట పాడించే అవ‌కాశం రావ‌డం నా అదృష్టం అన్నారు.

More News

మన్మధుడి బర్త్ డే గిఫ్ట్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజు..అభిమానులకు పండుగ రోజు...!

పర్పస్ ఫుల్ & పవర్ ఫుల్ ఫిల్మ్ ఒక్కడొచ్చాడు - విశాల్

విశాల్ నటిస్తున్న తాజా మాస్ ఫిల్మ్ ఒక్కడొచ్చాడు.ఈ చిత్రాన్ని సూరజ్ తెరకెక్కిస్తున్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి లేటెస్ట్ అప్ డేట్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

ప్రేమమ్ ఎవరే...వీడియో సాంగ్ రిలీజ్..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమమ్.

తొలిరోజునే భారీగా ప్లాన్ చేసిన ఎన్టీఆర్....

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ రూపొందుతోన్న చిత్రం 'జనతాగ్యారేజ్’.