బాలీవుడ్‌కి డేట్స్ కేటాయించిన చైతన్య..?
Send us your feedback to audioarticles@vaarta.com
మన టాలీవుడ్ స్టార్స్ క్రమంగా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో పడ్డారు. కొందరు పాన్ ఇండియా సినిమాలతో మెప్పించాలనుకుంటుంటే, మరికొందరు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తమదైన గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ రెండో కేటగిరిలో చేరుతున్నాడు మరో టాలీవుడ్ హీరో.. ఆయనెవరో కాదు, అక్కినేని నాగచైతన్య. ఈ హీరో బాలీవుడ్ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన ఆమిర్‌ఖాన్ టైటిల్‌పాత్రలో నటిస్తోన్న లాల్ సింగ్ చద్దాలో నటించబోతున్నాడు. మే నెల నుంచి ఈ సినిమా కోసం డేట్స్‌ను కేటాయించాడట నాగచైతన్య. అది కూడా వారం, పదిరోజు కాదు.. ఏకంగా నెలరోజులు. మరీ బాలీవుడ్ ప్రేక్షకులను నాగచైతన్య తన నటనతో ఎలా మెప్పిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అసలు నాగచైతన్య పాత్ర ఎలా ఉండబోతుందోనని కూడా అందరిలో క్యూరియాసిటీ నెలకొంది.
నిజానికి ఈ పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేయాల్సింది. కానీ.. ఎందుకనో విజయ్ సేతుపతి చివరి నిమిషంలో డ్రాప్ అయ్యాడు. ఆయన స్థానంలో చైతన్య వచ్చి చేరాడు. ఆమిర్‌ఖాన్, కరీనా కపూర్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్నాడు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ సినిమా రీమేక్ ఇది. ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com