శైలజా రెడ్డి అల్లుడు చిత్రాన్ని ఘనవిజయం చేసిన తెలుగు ప్రేక్షకులకు చాలా థాంక్స్ - నాగ చైతన్య
Send us your feedback to audioarticles@vaarta.com
యువసామ్రాట్ నాగచైతన్య , అను ఇమాన్యూల్ జంటగా మారుతి దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణ లో నాగవంశి.ఎస్, పి.డి.వి.ప్రసాద్ లు సంయుక్తంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన హిలేరియస్ ఫ్యామిలి ఎంటర్టైనర్ శైలజారెడ్డి అల్లుడు.
ఈ చిత్రం వినాయకచవితి సంధర్భంగా సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మెదటిరోజు 12 కోట్లు వసూలు చేయ్యటమె కాకుండా మూడురోజులకి దాదాపు 23 కోట్ల రూపాయిలు వసూలు చేసి పీపుల్స్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద యువసామ్రాట్ నాగచైతన్య, మారుతి కాంబినేషన్ లో రికార్డు కలెక్షన్లు వసూలుచేయబోతున్న సందర్భంలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో యువసామ్రాట్ నాగచైతన్య, అను ఇమ్మాన్యుయల్ మారుతి, నరేష్, 30 ఇయర్స్ పృధ్వి, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి, నిర్మాత నాగవంశి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యువసామ్రాట్ నాగచైతన్య మాట్లాడుతూ.. ఫస్ట్ తెలుగు ప్రేక్షకులందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మా శైలజారెడ్డి అల్లుడు కి మంచి ఓపెనింగ్ ఇచ్చారు. మెదట ఈ కలెక్షన్స్ చెప్పినప్పుడు నమ్మలేకపోయాను. ముఖ్యంగా మౌత్ టాక్ ని చాలా పాజిటివ్ గా స్ప్రెడ్ చేసిన వారందరికి, చేస్తున్నవారందరికి థ్యాంక్యూ సో మచ్. నాకు ఈ సినిమాకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నా లుక్ చాలా ఫ్రెష్ గా ఢిఫరెంట్ గా కనిపిస్తున్నానని అలానే బాడిలాంగ్వేజ్ చాలా ఎనర్జిటిక్ గా వుందని అంటున్నారు.. ఒక యాక్టర్ కి ఇదే బెస్ట్ కాంప్లిమెంట్ థ్యాంక్యూ మారుతి గారు.
నా కెరియర్ లో మంచి హిట్ కావాలి అన్నప్పుడు ప్రేమమ్ చిత్రం ఇచ్చారు.. ఇప్పడు శైలజారెడ్డి అల్లుడు ఇచ్చారు. నిర్మాతలకు థ్యాంక్యూ. అలాగే హీరోయిన్ అను చాలా బాగా చేసింది, నరేష్ గారితో 100 లవ్ నుండి మంచి సపోర్ట్ వుంది, నిజార్ సినిమాటోగ్రఫి బాగుంది. పృద్వి గారి గురించి చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి. మాణిక్యం గా చాలా బాగా చేశారు. ఈ సినిమాని ఇలానే ఆదరించాలని దీనికి సహకరిస్తున్న మీడియా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. శైలజారెడ్డి అల్లుడ్ని తెలుగు ప్రేక్షకులు వాళ్ళ ఇంటి సొంత అల్లుడి లా ఆదరిస్తున్నారు. మెదటి రోజు కలెక్షన్లు కాని ఈ మూడురోజులు కలెక్షన్లు కాని మాకు చాలా ఆనందాన్ని ఎనర్జిని ఇచ్చింది. అక్కినేని ఫ్యాన్స్ అందరూ నాకు సూపర్ ఎనర్జిని ఇచ్చారు..ఈ జోనర్ కు ముఖ్యంగా యూత్ కూడా వచ్చి అప్రిషియేట్ చేశారు. ఫ్యామిలీస్ సినిమా బాగుందని ఫోన్స్ చేస్తున్నారు. నా గత చిత్రాల కంటే బాగుందన్నారు. టీం అందరికీ చాలా చాలా థాంక్స్ చెప్పాలి.
చైతన్య గారి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ రావడం... అది నా సినిమాతో రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో మరో సినిమా చేయాలనేంత ఎనర్జీ ఇచ్చారు. నా సినిమాలో నటించిన అందరికీ చాలా చాలా థాంక్స్. ఈ సినిమా విజయం నాలో మరింత బాధ్యత పెంచింది. నా టీమ్ అందరూ అలానే సితార ఎంటర్టైన్ మెంట్ కి నా థ్యాంక్స్. మా హీరో నాగచైతన్య గారికి, అను గారికి మా శైలజారెడ్డి రమ్యకృష్ణ మేడమ్ కి నా స్పెషల్ థ్యాంక్స్.. ఈచిత్రాన్ని ఇలానే ఆదరించాలని కొరుకుంటున్నా.
అను ఇమ్మాన్యుయల్ మాట్లాడుతూ... ముందు ఆడియెన్స్ కి థాంక్స్ చెప్పాలి. ఈ సక్సెస్ మీట్ కి కారణం మీరు. శైలజా రెడ్డి అల్లుడు దర్శకుడు మారుతికి, హీరో నాగచైతన్య కు చాలా చాలా థాంక్స్. సినిమా చూడని వాళ్లు థియేటర్ కి వెళ్లి తప్పకుండా చూడండి. అని అన్నారు.
సక్సెస్ మీట్ లో నటుడు పృథ్వీ మాట్లాడుతూ... సినిమా థియేటర్లో చూశాను. జనాలు ఫుల్ ప్యాక్ డ్ గా ఉన్నారు. డైరెక్టర్ మారుతి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అన్ని రకాలుగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఉమ్మడి కుటుంబం, హ్యూమన్ రిలేషన్స్, ఇగోల గురించి చక్కగా చెప్పారు. ఈగోయిస్ట్ క్యారెక్టర్లో అను కరెక్ట్ గా సరిపోయారు. నాగ చైతన్య గారు సూపర్బ్ పెర్ ఫార్మెన్స్. కొన్ని చోట్ల నాగార్జున గారు కనిపిస్తున్నారని రివ్యూస్ లో రాశారు.
క్యారెక్టర్లో లీనమై నటించారు. నరేష్ గారు ఉంటే షూటింగ్ సరదాగా జరిగేది. కామెడీగా స్ఫూఫులు చేసే నాకు మారుతి బాబు బంగారంలో మంచి పాత్ర ఇచ్చారు. ఇప్పడు శైలజా రెడ్డిలో మాణిక్యం అనే క్యారెక్టర్ ఇచ్చారు. చాలా మంది ఇలాగే కంటిన్యూ చేయి అంటున్నారు. మా నిర్మాత వంశీకి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. మారుతి గారి దగ్గర పనిచేస్తే డెబిట్ కార్డ్ వచ్చినట్టే. డైరెక్టర్, బ్యానర్ నిలబడితే చాలా ఫ్యామిలీస్ నిలబడతాయి. రమ్యకృష్ణ గారు అద్భుతంగా నటించారు అని అన్నారు.
సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి మాట్లాడుతూ.... అందరికీ సినిమా నచ్చిందంటున్నారు. థాంక్స్ టూ మారుతి గారు వంశీ గారు. ఈ టీంతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.
సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ... శైలజా రెడి అల్లుడు సూపర్ హిట్ శుభాకాంక్షలు. పీపుల్స్ డైరెక్టర్ మారుతికి కంగ్రాట్స్. అందరి పల్స్ క్యాప్చర్ చేసిన ఈ జెనరేషన్ డైరెక్టర్. నాగచైతన్య లవర్ బాయ్ రోల్స్ అద్భుతంగా చేస్తూ.... కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా హయ్యెస్ట్ గ్రాసర్ సొంతం చేసుకున్నాడు. రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్ డే. సితార ఎంటర్ టైన్ మెంట్స్, హారిక హాసిని సంస్థల తో నాకు మంచి రిలేషన్ ఉంది. వరుసగా హిట్స్ అందిస్తున్నారు.
పృథ్వీ అద్భుతమైన సీన్స్ చేశాడు. షూటింగ్ అప్పుడే పృథ్వీ సీన్స్ పేలతాయని అర్థమైంది. అను టాలీవుడ్ లో సూపర్ హిరోయిన్ అవుతుంది. అక్కినేని ఫ్యాన్స్ కి నేను ముందే చెప్పాను ఈ వినాయక చవితి మీదే అని. వినాయకచవితి కుడుముల లాగ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మా మారుతి అందించాడు. నాకు భలే భలే మగాడివోయ్ సినిమాతో నరేష్ మళ్లీ కామెడీ చేయగలగడని నిరూపించింది.
మారుతి స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్న దమ్మున్న డైరెక్టర్. మురళీ శర్మ, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ బాగా పండింది. నాగచైతన్య యూత్ ని, రమ్యకృష్ణ ఫ్యామిలీస్ ని, అను కుర్రాళ్లని థియేటర్లకు రప్పిస్తున్నారు. ఈ ఏడాది ఫస్ట్ పండగలో, ఫస్ట్ హిట్ లో నేనుండడం చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments