సమంతతో ప్రేమ విషయం నాన్నకు చెప్పినప్పుడు ఫస్ట్ రియాక్షన్ అదే..! - నాగ చైతన్య
Send us your feedback to audioarticles@vaarta.com
ఏమాయ చేసావే, 100% లవ్, ఒక లైలా కోసం...ఇలా విభిన్న ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించని అక్కినేని అందగాడు నాగచైతన్య నటించిన తాజా చిత్రం ప్రేమమ్. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ఈ ప్రేమమ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో చైతన్య సరసన శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ నటించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ప్రేమమ్ చిత్రం దసరా కానుకగా ఈనెల 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా అక్కినేని అందగాడు నాగచైతన్యతో ఇంటర్ వ్యూ మీకోసం..!
మలయాళం ప్రేమమ్ - తెలుగు ప్రేమమ్ టైటిల్ ఒకటే..! మరి కథలో మార్పులు ఏమైనా చేసారా..?
రీమేక్ అనగానే ఇదేదో కాపీలా చేయలేదు. అలాగని మలయాళం ప్రేమమ్ కంటే బెటర్ గా చేయాలి. ఆ సినిమాలో తప్పులు కరెక్ట్ చేయాలి అని కాకుండా కథలో ఉన్న సోల్ తీసుకుని ఈ సినిమా చేసాం. ఈ సినిమాలో మూడు ప్రేమకథలు ఉంటాయి. మూడవ ప్రేమకథలో ఎక్కువ మార్పులు చేసాం. అలాగే ట్విస్ట్ ల్లో కూడా మార్పులు చేసాం.లవ్ జర్నీ అనేది ప్రతి మనిషి ఎప్పుడోకప్పుడు ఎక్స్ పీరియన్స్ చేసి ఉంటాడు. అందుచేత అందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది అని నా ఫీలింగ్.
ప్రేమమ్ సినిమా చేయడానికి కారణం ఏమిటి..?
దోచేయ్ సినిమా రిలీజ్ తర్వాత నాకు లవ్ స్టోరీస్ కంఫర్ట్ గా ఉంటుంది. అది కాకుండా ఆడియోన్స్ నన్ను లవ్ స్టోరీస్ లో ఎక్సాప్ట్ చేసారు కాబట్టి లవ్ స్టోరీ చేయాలి అనుకున్నాను. ఆ టైమ్ లో ప్రేమమ్ రిలీజ్ అయ్యింది. నాకు బాగా నచ్చడంతో ఈ సినిమా చేసాను.
చందు మొండేటి ముందు వేరే స్టోరీతో సినిమా చేయాలి అనుకున్నాడు కదా..!
అవును...! ఫస్ట్ చందు నాన్న గారితో ఓ సినిమా చేద్దామని కలిసాడు. ఆ టైమ్ లో నాన్నగారు వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వలన ఈలోపు వేరే సినిమా చేయి తర్వాత మనం సినిమా చేద్దాం అన్నారు. అప్పుడు చందు కార్తికేయ చేసాడు. కార్తికేయ తర్వాత మళ్లీ నాన్న గారిని కలిస్తే అప్పుడు నాతో సినిమా చేయమన్నారు. నాకోసం కథ రెడీ చేసాడు. ఆ కథతో మేము ట్రావెల్ అవుతున్నాం. ఇంతలో ప్రేమమ్ ప్రాజెక్ట్ రావడం...ఈ ప్రాజెక్ట్ కి చందు అయితే బాగుంటుంది అనిపించడం చందు ఓకే అనడం అంతా అలా జరిగిపోయింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు చందు టాలెంట్ ఏమిటో తెలిసింది. చందుని రీమేక్ మూవీని డైరెక్ట్ చేయమని అడిగి తప్పు చేసానేమో అనిపించింది.
సోషల్ మీడియాలో మలయాళం ప్రేమమ్ తో తెలుగు ప్రేమమ్ ను కంపేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు చూసారా..?
రీమేక్ చేయడం అనేది ఇదేమి ఫస్ట్ టైమ్ కాదు. మన సినిమాలను వేరే భాషల్లో రీమేక్ చేసారు. మనం వేరే భాషల చిత్రాలను రీమేక్ చేసాం. అయినా...ఇప్పుడు ఎందుకు ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయో అర్ధం కావడం లేదు. ఇలాంటి కామెంట్స్ వస్తాయని ఊహించలేదు. మలయాళం ప్రేమమ్ లో నవీన్ పాల్ ఏక్టింగ్ కి ఫ్యాన్ నేను.
మలయాళ ప్రేమమ్ కంటే తెలుగు ప్రేమమ్ రన్ టైమ్ తగ్గించడానికి కారణం ఏమిటి..?
రన్ టైమ్ తగ్గించాం కానీ...కథను తగ్గించలేదు. మలయాళంలో స్లోగా, పొయేటిక్ గా ఉంటే ఇష్టం. కానీ..మనకు కథలో స్పీడు ఉండాలి. అందుకనే మన నేటివిటీకి తగ్గట్టు రన్ టైమ్ తగ్గించాం.
ప్రేమమ్ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నారా..? ఏరేంజ్ సక్సెస్ సాధిస్తుంది అనుకుంటున్నారు..?
100% కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కాకపోతే ఏరేంజ్ సక్సెస్ సాధిస్తుంది అనేది ఇప్పుడు చెప్పలేను. రిలీజ్ కి రెండు నెలల ముందే ప్రేమమ్ రెడీ అయ్యింది. అలా మనం సినిమాకి జరిగింది. మళ్లీ ఇప్పుడు జరిగింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్....ఈ సినిమాకి సలహాలు, సూచనలు ఏమైనా ఇచ్చారా..?
త్రివిక్రమ్ గారు నాతో ఏమీ డిష్కస్ చేయలేదు. చందుతో డిష్కస్ చేసారేమో. నాకు తెలిసి నాన్న గారి వాయిస్ ఓవర్ ని త్రివిక్రమ్ గారు రాసారు అనుకుంట..!
ఈ చిత్రంలో నాన్నగారు వాయిస్, మామయ్య వెంకటేష్ గెస్ట్ రోల్ చేయడం..ఎలా ఫీలయ్యారు..?
మామయ్య ఈ సినిమాలో నటించారా...(నవ్వుతూ...) స్ర్కీన్ పై చూడడండి ఏం చేసారో..! నేనైతే చాలా హ్యాపీగా ఫీలయ్యాను.
సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ లేట్ అవ్వడానికి కారణం ఏమిటి..?
ఈ మూవీ తెలుగు, తమిళ్ లో చేస్తున్నారు. తెలుగు వెర్షెన్ షూటింగ్ పూర్తయ్యింది అంతా రెడీగా ఉంది. అయితే...తమిళ్ వెర్షెన్ కొంచెం షూటింగ్ చేయాలి. తెలుగు, తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయాలి అనుకుంటున్నాం. అందుచేత లేట్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ చేసేది త్వరలో ఎనౌన్స్ చేస్తాం.
ఇక మీ పెళ్లి విషయానికి వస్తే...సమంతతో పెళ్లి ఎప్పుడు..?
వచ్చే సంవత్సరం ఉంటుంది. ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించలేదు.
మీ ప్రేమ గురించి ఫస్ట్ ఎవరితో చెప్పారు..?
నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఫ్యామిలీ మెంబర్స్ లో అయితే ఫస్ట్ నాన్నతో చెప్పాను.
నాన్నతో మీ లవ్ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏమిటి..?
నాకు ముందే తెలుసు రా....ఎప్పుడు చెబుతావా అని ఎదురు చూస్తున్నాను అన్నారు(నవ్వుతూ...)
మీ లవ్& మ్యారేజ్ న్యూస్ సెన్సేషన్ అనుకుంటే సడన్ గా అఖిల్ షాక్ ఇచ్చాడు. అఖిల్ లవ్ గురించి మీకు ముందే తెలుసా..?
అఖిల్ మీకే కాదు మాకు కూడా షాక్ ఇచ్చాడు. అఖిల్ న్యూస్ తెలిసి నేను, నాన్న షాక్ అయ్యాం. అంత చిన్న వయసులో నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం కావాలి. అది వాడికి చాలా ఉంది. టోటల్ గా ఫ్యామిలీ అంతా హ్యాపీ..! నా పెళ్లి కంటే అఖిల్ పెళ్లే ముందు జరుగుతుంది.
సమంత పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా..?
ఎందుకు నటించదు. ఖచ్చితంగా నటిస్తుంది. ఇంకా చెప్పాలంటే...నా కంటే ఎక్కువ సినిమాల్లో తనే నటిస్తుంది.
ప్రేమమ్ లో సమంతనే సెలెక్ట్ చేయవలసిందేమో....?
సమంత సోలో హీరోయిన్ గా త్వరలో ఓ సినిమా చేస్తాను.
ఇంతకీ...సమంతకి ఏ గిఫ్ట్ ఇస్తున్నారు..?
సమంతకి నేనే ఓ గిఫ్ట్..అలాగే నాకు సమంతే ఓ గిఫ్ట్. ఇంక ప్రత్యేకించి గిఫ్ట్స్ ఇచ్చుకోవడం దేనికి..? (నవ్వుతూ..)
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే చిత్రం నవంబర్ లో ప్రారంభం అవుతుంది. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నూతన దర్శకుడు కృష్ణతో ఓ సినిమా చేస్తున్నాను. ఇంద్రగంటి మోహనకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments