అఖిల్ మ్యారేజ్ ఎక్కడో బయటపెట్టిన చైతు..!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్, ప్రముఖ పారిశ్రామికవేత్త జి.వి.కె మనవరాలు శ్రేయా భూపాల్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరి ఎంగేజ్ మెంట్ డిసెంబర్ 9న హైదరాబాద్ జి.వి.కె హౌస్ లో సినీ ప్రముఖులు, ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో గ్రాండ్ గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పెళ్లికి కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ సందర్భంగా సాహసం శ్వాసగా సాగిపో ప్రమోషన్స్ లో పాల్గొన్న చైతన్య ను అఖిల్ మ్యారేజ్ గురించి అడిగితే ఇంట్రస్టింగ్ న్యూస్ బయటపెట్టారు. ఇంతకీ...నాగ చైతన్య అఖిల్ మ్యారేజ్ గురించి ఏం చెప్పారంటే...అఖిల్ ఎంగేజ్ మెంట్ డిసెంబర్ 9న జరుగుతుంది. ఆతర్వాత పెళ్లి మేలో ఉంటుంది. అయితే... అఖిల్ మ్యారేజ్ రోమ్ లో ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ మ్యారేజ్ తర్వాతే నా పెళ్లి ఉంటుంది అని చెప్పాడు. అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com