రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా.. నేను గెలిస్తే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల సీజన్ ముగియడంతో ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని అసెంబ్లీ, పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్థులందరూ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అసలు ఈ ఎన్నికలు-ఫలితాలకు మధ్యలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎన్నికల అనంతరం ఫస్ట్ టైమ్.. ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన నాగబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ లైవ్‌లో నాగబాబుతో పాటు దర్శకుడు మెహర్ రమేష్ కూడా పాలు పంచుకున్నారు. ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా గెలిస్తే ఆకాశమే హద్దుగా పనిచేస్తానని ఈ సందర్భంగా నాగబాబు చెప్పుకొచ్చారు.
నాగబాబు మాటల్లోనే..
"చాలా రోజుల తరువాత మీతో నా అనుభవాలను పంచుకోవాలని అనిపించింది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో నాకు ఎదురైన వాటిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఫేస్ బుక్ లైవ్ ద్వారా మీ ముందుకు వచ్చా. ముఖ్యంగా నేను మొన్న నరసాపురం ఎంపీగా పోటీ చేశాను. రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా. నరసాపురం ఏరియాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల ప్రజలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా తమ్ముడు జనసేన అధినేత భీమవరం నుండి పోటీ చేశారు. మా తమ్ముడు అని అనలేకపోతున్నా.. నాయకుడు అని అనడం అలవాటు అయ్యింది" అని నాగబాబు చెప్పుకొచ్చారు.
ఫలితం ఎలా వస్తుందో..!
"ఇక ఎన్నికల ప్రచారంలో ప్రజలందరూ మాపై చూపిన ప్రేమకి.. మా జీవితానికి ఇది సరిపోతుంది అనిపించింది. రిజల్ట్ అనేది మా చేతుల్లో లేదు. ఫలితం ఎలా వస్తుందో తెలియదు. అది నాకు అనవసరం కూడా. అయితే పాజిటివ్ రిజల్ట్‌ని ఊహిస్తున్నా. ఏది ఏమైనా ఎన్నికల సందర్భంగా ప్రజలు నాపై చూపిన ప్రేమకు నా జీవితాన్ని వాళ్లకు అంకితం చేశాయాలని అనిపించింది. గతంలో పీఆర్పీ పార్టీకి ప్రచారం చేశారు. అయితే అప్పుడు చూపించిన ఆదరణకి ఇప్పటికీ వంద శాతం తేడా ఉంది. మెయిన్‌గా కళ్యాణ్ బాబు అంటే విపరీతంగా ఆదరిస్తున్నారు. పార్టీని జనంలోకి బాగా తీసుకువెళ్లారు. నాకు ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా యూత్‌ని చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అంతలా దగ్గరయ్యా వాళ్లకి. నేను ప్రచారంలో చూసిన వాళ్లందరి ముఖాలు నాకు గుర్తుకు వస్తున్నాయి. వాళ్ల ప్రేమ ఆదరణ చూస్తుంటే ప్రపంచంలో ఎవరితోనైనా ఫైట్ చేయగలం అనే ధైర్యం వచ్చింది. అలాంటి ప్రజలకోసం ఏదైనా చేయాలని అనిపిస్తుంది. ఈ సందర్భంగా నాకు ఏం మాట్లాడాలో అర్ధం కావడంలేదు" అని మెగా బ్రదర్ తెలిపారు.
నా ప్లాన్స్.. నాకున్నాయ్..!
"ఇంత ప్రేమ చూపించిన నా నరసాపురం ప్రజలకు నేను ఏం చేయగలను. ఎంపీగా పోటీ చేశాను కాబట్టి ఎలా చేస్తానన్నది నా ప్లాన్స్ నాకు ఉన్నాయి. నా శక్తి ప్రకారం ఎలా చేయాలి? ఏం చేయాలన్నది పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తాను. నరసాపురం ఎంపీగా విజయం సాధిస్తే.. ఆకాశమే హద్దుగా పనిచేస్తా. లిమిట్స్ ఉండవు. ఒక ఎంపీ ఏం చేయగలడో.. ఎంత చేయగలడో చేసి చూపిస్తాను" అని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. అయితే మే-23న ఫలితం ఎలా వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments