శివాజీ రాజా 'రిటర్న్‌గిఫ్ట్‌' పై నాగబాబు రియాక్షన్!

  • IndiaGlitz, [Thursday,April 25 2019]

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన మెగా బ్రదర్, జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాజీ అధ్యక్షుడు, నటుడు శివాజీ రాజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే నాగబాబు పోటీ చేస్తున్న నర్సాపురంకు వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టి మరీ నాగబాబుపై వ్యక్తిగతంగా సంచలన వ్యాఖ్యలు చేసి.. ఎవ్వరూ నాగబాబుకు ఓటు వేయద్దని పిలుపునిచ్చి చెప్పాల్సిందంతా చెప్పేశారు. అయితే ఈ వ్యవహారంపై ఇంత వరకూ నాగబాబు రియాక్ట్ అవ్వలేదు.

తాజాగా.. శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు రియాక్ట్ అయ్యారు. తాను ఎంపీ స్థాయిలో పోటీ చేస్తున్నాను కాబట్టి.. ఆ స్థాయికి తగిన విమర్శలకు మాత్రమే స్పందించాలని మొదట భావించానని.. అయితే ప్రతి ఒక్కరూ దీని గురించి అడుగుతుండడంతో స్పందించక తప్పడంలేదని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే డైరెక్టుగా శివాజీ వ్యాఖ్యలకు నాగబాబు రియాక్టవ్వకుండా మా ఎన్నికలతో లింక్ పెట్టి మెగా బ్రదర్ మాట్లాడారు.

అందుకే నరేష్ ప్యానెల్‌కు మద్దతిచ్చా!

కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నరేష్ ప్యానల్‌కు సపోర్ట్ చేశాను. వాస్తవానికి నాకు నరేష్‌తో కంటే శివాజీరాజాతోనే అనుబంధం ఎక్కువ. నాకు ఎవరిపైనా వ్యక్తిగతంగా ద్వేషం లేదు. కానీ.. రాజశేఖర్, జీవిత అనేక సార్లు నాకు ఫోన్ చేసి సపోర్ట్ చేయాలంటూ అభ్యర్థించారు. అయితే శివాజీ రాజా కూడా కలుద్దామని చెప్పి కలవలేదు. అందుకే నేను నరేష్ ప్యానెల్‌కు మద్దతిచ్చాను. శివాజీరాజా ఓ పర్యాయం 'మా' అధ్యక్షుడిగా పనిచేశాడు. అందుకే ఒకసారి కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని భావించడంలో తప్పులేదు అని నాగబాబు చెప్పుకొచ్చారు.