ఈనెల 10న నాగ అన్వేష్ ఏంజిల్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
టాలెంటెడ్ హీరో నాగ అన్వేష్ - కుమారి 21 ఫేమ్ హేబా పటేల్ హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఏంజిల్. బాహుబలి సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన పళని ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధూరపువ్వు కృష్ణారెడ్డి ఏంజిల్ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఈ నెల 10న లాంఛనంగా ప్రారంభం కానుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రస్తుతం భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ డైరెక్షన్ లో సాంగ్స్ రికార్డింగ్ జరుపుకుంటోంది. విజయప్రకాశ్, శ్రేయాఘోషల్, నకాష్ అజీజ్ వంటి స్టార్ సింగర్స్ ఈ చిత్రంలో పాటలు పాడటం విశేషం.
నాగ అన్వేష్ - హేబా పటేల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు- భీమ్స్ సెసిరోలియో, ప్రొడ్యూసర్- సింధూరపువ్వు కృష్ణారెడ్డి, డైరెక్టర్- బాహుబలి పళని
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments