నాగ అన్వేష్ 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' ప్రారంభోత్సవం
Send us your feedback to audioarticles@vaarta.com
పుష్పకవిమానం, ఆదిత్య 369 వంటి ప్రయోగాత్మక చిత్రాల కోవలో మరో వినూత్న చిత్రం షో టైం స్టూడియో సమర్పించు గణేష్ క్రియేషన్స్ సంస్థ నుంచి నాలుగవ ప్రొడక్షన్ గా ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే చిత్రం రాబోతోంది. నాగ అన్వేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (మార్చి 3) హద్రాబాద్ లో జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత లండన్ గణేష్ మాట్లాడుతూ... "మా బ్యానర్ లో ఇదివరకు మొదటి ప్రొడక్షన్ ఓపెనింగ్ స్వర్గీయ రామానాయుడి గారి చేతుల మీదుగా జరిగింది. ఇప్పుడు నాలుగవ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నేను లండన్ లో ఉండటం మూలాన లండన్ అనేది ఇంటిపేరుగా మారిపోయింది. ఇక సినిమా విషయానికి వస్తే 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ అశ్విన్ హీరోగా, నా స్నేహితుడు నాగేశ్వర రావు సహకారంతో నిర్మించడం జరుగుతోంది. తప్పకుండా ప్రేక్షకాదరణ పొందే చిత్రం అవుతుందని భావిస్తున్నా" అన్నారు.
మరో నిర్మాత వి.నాగేశ్వర రావు మాట్లాడుతూ.. "మంచి కథ అవడంతోనే నేను భాగస్వామిని అయ్యాను. ఫారిన్, సిటీ, ఫారెస్ట్ ఇలా 3 షెడ్యూల్ లో షూటింగ్ ఉంటుంది. కొత్త కథ కనుక ఆడియన్స్ కు నచ్చి తీరుతుందని ఆశిస్తున్నా" అన్నారు.
హీరో నాగ అశ్విన్ మాట్లాడుతూ.. "చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్.. టైటిల్ కు తగ్గట్టుగానే ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో అనే విదంగానే ఉంటుంది ప్రతి సన్నివేశం. టాలీవుడ్ లొనే డిఫరెంట్ సబ్జెక్టుగా నిలుస్తుందని, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను" అన్నారు.
దర్శకుడు శ్రీ కృష్ణ గొర్లె మాట్లాడుతూ.. "సైన్క్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మూడు షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేస్తాము. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి తమ అమూల్యమైన ఆశీర్వచనాలు అందించిన వి వి వినాయక్, సాగర్, మరియు రమణ గారికి నా కృతజ్ఞతలు" అన్నారు.
ఈ నూతన చిత్రానికి హీరో నాగ అన్వేష్ కాగా ఓ ప్రముఖ హీరోయిన్ నటించనుంది.. డీఓపీ: భాస్కర్ సమల, నిర్మాతలు: లండన్ గణేష్, సి హెచ్. వి. నాగేశ్వరరావు, కథ-మాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శ్రీ కృష్ణ గొర్లె.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments