BiggBoss: తిక్కల్దానిలా వుండకు.. గలాటా గీతూకి గడ్డిపెట్టిన నాగ్
- IndiaGlitz, [Sunday,September 11 2022]
బిగ్‌బాస్ అభిమానులంతా కోరుకునే రోజు రానే వచ్చింది. కంటెస్టెంట్స్ చేసిన తప్పులు, వారి ఆటతీరు గురించి చెబుతూ క్లాస్ పీకారు నాగార్జున. ఆయన వస్తుండటంతో ఎక్కడివారు అక్కడే అన్నట్లు అటెన్షన్‌తో కూర్చున్నారు కంటెస్టెంట్స్. కోవిడ్ కారణంగా ఆడియన్స్ లేకుండానే నాగార్జున వచ్చే ఎపిసోడ్స్ రన్ అయ్యేవి. ప్రస్తుతం భారతదేశంలో పరిస్ధితులు కుదటపడటంతో ఈసారి ఆడియన్స్‌ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గీతూ రాయల్‌ని జైల్లో పెట్టడం కరెక్టేనా అని ప్రేక్షకులను అడిగారు నాగ్. వీరిలో ఎక్కువ మంది దానికి మద్ధతు పలికారు. ఇక కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని ప్రశ్నించే పనికి శ్రీకారం చుట్టారు నాగార్జున.
రేవంత్ నువ్వు బూతులు బాగా వాడుతున్నావ్ అని నాగ్ అనగానే.. నేనా సార్ అంటూ వాదించాడు. దీనికి సాక్ష్యాలు కూడా వున్నాయమ్మా చూపించనా అని నాగ్ అనగా.. వద్దు సార్ అన్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచిన సీన్ జరిగింది. రోహిత్, మెరీనాలతో మాట్లాడుతూ... మా అందరి ముందు మెరీనాకు టైట్ హగ్ ఇవ్వు అని అడిగారు నాగ్.. ఆ వెంటనే వారిద్దరూ కౌగిలించుకున్నారు. అప్పుడే నారాయన , నారాయణ వారిద్దరూ మ్యారీడ్ అంటూ ఓ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సెటైర్లు ఎవరికి తగలాలో వారికి గట్టిగానే తగిలినట్లుగా వుంది. అంతేకాదు.. భర్త తనతో టైం స్పెండ్ చేయడం లేదని బాధపడిపోతున్న మెరీనా బాధను అర్ధం చేసుకుని దగ్గరుండి మరీ హగ్ ఇప్పించారు నాగార్జున.
తర్వాత ఎవరో ఏదో అనుకుంటారని ప్రతి ఒక్కరినీ బ్రో అని పిలవక్కర్లేదని కీర్తికి చెప్పారు. నువ్వు గేమ్ బాగా ఆడాలని అభినయశ్రీకి సూచించారు కింగ్. అర్జున్ బాగా ఆడుతున్నాడని.. శ్రీ సత్యని కొంచెం యాక్టివ్‌గా వుండాలన్నారు. ఈ వారం హాట్ టాపిక్‌గా మారిన ఆరోహి, రేవంత్ గొడవను బయటకు తీశారు నాగార్జున. గేమ్ బాగా ఆడమని ఎంకరేజ్ చేసి పంపించింది.. ఓడిపోయి తిరిగి వస్తే వెక్కిరించేలా మాట్లాడవంటూ రేవంత్‌పై ఫైరయయారు. ఇక గలాటా గీతూ రాయల్ ఆట బాగుందని.. కానీ మాట తీరు మార్చుకోవాలని నాగ్ సూచించారు. ప్రతిసారి ఇనయాను తిక్కల్దానా అనడం సరికాదని.. జనాలు నిన్నే తిక్కల్దానిలాగా చూస్తున్నారని ఆయన చెప్పారు. నువ్ అన్ని మాటలు చెప్పావ్.. కానీ టిష్యూలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నావ్.. మనం చెప్పే మాటలను మనం పాటించాలి.. సంబంధం లేని విషయాల్లో దూరితే జైల్లో వేస్తారు అని గీతూకి సుతి మెత్తగా వార్నింగ్ ఇచ్చారు నాగార్జున.
అటు తొలి వారం కెప్టెన్సీ టాస్క్ సమయంలో సంచాలక్‌గా వ్యవహరించిన ఫైమాపై ప్రశంసల వర్షం కురిపించారు నాగార్జున. ప్రతి వారం నాతో ఫేమస్ ఫైమా అని చెప్పించుకోవాలని సూచించారు. చలాకీ చంటిలో చలాకీతనం ఎక్కడుందని ప్రశ్నించారు. అలాగే బయటి వ్యక్తుల విషయాలను హౌస్‌లో బయటకు తీయొద్దని శ్రీహాన్ - ఇనయా గొడవపై మాట్లాడారు. మధ్యలో శ్రీహాన్ కలగజేసుకుంటూ.. బయటివాళ్ల సపోర్ట్ వుందంటూ ఇనయా మాట్లాడటం బాలేదన్నాడు. దీనికి నాగ్ బదులిస్తూ.. ఇక్కడ ఆడియన్స్ సపోర్ట్ తప్పితే ఏ సపోర్ట్ వుండదని తేల్చిచెప్పాడు . నీకు సంబంధం లేని విషయాల్లో దూరడం.. దాని మీద డిస్కషన్లు పెట్టడం బాలేదని ఆదిరెడ్డికి క్లాస్ పీకారు నాగార్జున. రివ్యూలు ఇవ్వడం మానేసి ఆట ఆడమంటూ సలహా ఇచ్చారు.
అనంతరం కంటెస్టెంట్స్ కార్డుల ద్వారా తమ ఇంటి సభ్యులపై ఎలాంటి ఫీలింగ్ ఉందో చెప్పాలని కోరాడు. ఫైనల్ గా వెన్నుపోటు బ్యాడ్జ్ రేవంత్ కి, కన్నింగ్ బ్యాడ్జ్ గీతూకి వచ్చింది. తర్వాత ఈవారం నామినేషన్‌లో వున్న ఏడుగురిలో శ్రీసత్య, చంటీలను సేవ్ చేశారు నాగ్. ఇక మిగిలిన రేవంత్, ఆరోహి, ఫైమా, ఇనాయా, అభినయశ్రీలలో ఎవరు బయటకు వెళ్తారో రేపటి ఎపిసోడ్‌లో తేలిపోనుంది.