అక్కినేని - దగ్గుబాటి కలిసి నటిస్తున్నారట..
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని ఫ్యామిలీ హీరో కింగ్ నాగార్జున, దగ్గుబాటి ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్...వీళ్లిద్దరు కలిసి నటిస్తున్నారట.గతంలో వీరిద్దరు కలసి నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు పూర్తి వివరాలు బయటకు రాలేదు. అయితే తాజాగా నాగ్, వెంకీ...కలసి నటించే ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించి కధా చర్ఛలు జరుగుతున్నాయట.ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
నాగ్, వెంకీ కలసి నటించడం నిజంగా నిజం. అయితే ఈ క్రేజీ మూవీకి డైరెక్టర్ ఎవరు..? నిర్మాత ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నాగ్, వెంకీ కలసి నటిస్తుండడంతో అక్కినేని ఫ్యాన్స్ కి, దగ్గుబాటి ఫ్యాన్స్ కి ఇక పండగే. టాలీవుడ్ చరిత్రలో భారీ మల్టీస్టారర్ గా రూపొందే ఈ క్రేజీ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com