నాగార్జునతో విమలారామన్...
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో త్వరలోనే భక్తిరస చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. సినిమా జూన్ నుండి చిత్రీకరణ జరుపుకోనుంది. ఓం నమో వెంకటేశాయ` టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున వెంకటేశుని భక్తుడు హథీరాంబాబాగా నటిస్తున్నాడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఎ.మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ లు నటించబోతున్నారు. వీరితో పాటు విమలారామన్ కూడా నటించనుంది. ఈ చిత్రంలో అనుష్క గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తుందని, ప్రగ్యాజైశ్వాల్, విమలారామన్ లు కీలకపాత్రల్లో నటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com