వాలెంటైన్స్ డే స్పెషల్ గా నాగ్ మూవీ టీజర్ రిలీజ్...
Wednesday, February 10, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సోగ్గాడే చిన్ని నాయనా...సినిమాతో బ్లాక్ బష్టర్ సాధించిన నాగార్జున తాజాగా మరో బ్లాక్ బష్టర్ సాధించడం కోసం ఊపిరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నాగార్జున - కార్తీ - తమన్నా కాంబినేషన్లో రూపొందిన ఊపిరి చిత్రాన్ని ఎవడు ఫేం వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఫ్రెంచ్ ఫిల్మ్ ది అన్ టచ్ బుల్స్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఊపిరి టీజర్ ను ఈ నెల 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గోపీ సుందర్ సంగీతాన్ని అందించిన ఊపిరి ఆడియోను ఈ నెలాఖరున రిలీజ్ చేయనున్నారు. ఇక సినిమాని మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments