అనుష్కకు అమ్మగా నాగ్ హీరోయిన్..

  • IndiaGlitz, [Wednesday,July 27 2016]

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో పిల్ల జ‌మిందార్ ఫేమ్ అశోక్ తెర‌కెక్కించ‌నున్న చిత్రం భాగ‌మ‌తి. ఈ చిత్రాన్ని యు.వి. క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై వంశీ కృష్ణా రెడ్డి, ప్ర‌మోద్ ఉప్ప‌ల‌పాటి సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క అమ్మ క్యారెక్ట‌ర్ కు ముందుగా న‌దియాను అన‌కున్నార‌ట‌. ఆత‌ర్వాత ట‌బు అయితే బాగుంటుంది అని సంప్ర‌దించార‌ట‌. క‌థ విని ట‌బు అనుష్క అమ్మ‌గా న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. బాల‌కృష్ణ, రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందిన పాండురంగ‌డు సినిమా త‌ర్వాత ట‌బు తెలుగు సినిమా చేయ‌లేదు. అంటే ట‌బు తెలుగు సినిమా చేసి దాదాపు ఎనిమిదేళ్ల అవుతుంది. భాగ‌మ‌తిలో ట‌బు న‌టించ‌డం నిజ‌మైతే...ఈ ప్రాజెక్ట్ కు మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.