మరో ప్రయోగానికి రెడీ అంటున్ననాగ్..

  • IndiaGlitz, [Monday,June 20 2016]

ప్ర‌యోగాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే హీరో కింగ్ నాగార్జున‌. తెలుగు తెర పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ప్ర‌యోగాలు చేసిన నాగార్జున ఇటీవ‌ల వీల్ ఛైర్ కే ప‌రిమిత‌మైన పాత్ర‌లో ఊపిరి చిత్రంలో న‌టించి మెప్పించారు. తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓం న‌మో వెంక‌టేశాయ అనే భ‌క్త‌ర‌స చిత్రంలో న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే...నాగార్జున‌ విల‌న్ గా న‌టించి ఓ ప్ర‌యోగం చేయాల‌నుకుంటున్నార‌ట‌.
సాహ‌సం శ్వాస‌గా సాగిపో ఆడియో వేడుక‌లో నాగార్జున గౌత‌మ్ మీన‌న్ తో సినిమా చేయాల‌నుకుంటున్న విష‌యం బ‌య‌ట‌పెట్టారు. విల‌న్ రోల్ చేయ‌డానికి సైతం ఓకే అని నాగ్ స్వ‌యంగా చెప్పారు. గౌతమ్ మీన‌న్ తో పాటు విక్ర‌మ్ కుమార్, వంశీ పైడిప‌ల్లి ల‌కు కూడా నాగ్ డిఫ‌రెంట్ స్టోరీ రెడీ చేయండి విల‌న్ గా అయినా స‌రే న‌టిస్తాను అని చెప్పార‌ట‌. మ‌రి..ఈ ముగ్గురిలో ఎవ‌రు నాగ్ ని మెప్పిస్తారో...ఎవ‌రు నాగ్ ని విల‌న్ గా చూపిస్తారో చూడాలి.