BiggBoss: బిగ్‌బాస్ విన్నర్‌కు ‘రూ.కోటి’..... శ్రీహాన్- రేవంత్ మధ్య చిచ్చుపెట్టిన నాగ్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగు చివరి అంకానికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. ఇప్పటికే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో గెలిచి శ్రీహాన్ ఫైనల్‌లో అడుగుపెట్టగా... మిగిలిన వారు ఆ దిశగా వెళ్తున్నారు. అలాగే గతంలో పలు సందర్భాల్లో కట్ చేసిన ప్రైజ్‌మనీని తిరిగి ఇచ్చే టాస్క్‌లు ఇస్తున్నాడు. నిన్నటి వరకు ఇంటి సభ్యులంతా పలు ఛాలెంజ్‌లు గెలుచుకుంటూ ప్రైజ్‌మనీని రూ.47,00,000కు తీసుకొచ్చారు. ఇక ఆదివారం కావడంతో హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ‘సై సై సయ్యారే’’ పాటతో వచ్చారు. తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ కన్ఫెషన్ రూమ్‌కి రమ్మన్నారు. దీనికి శ్రీసత్య మళ్లీ దెయ్యాల టాస్కా అని భయంగా అడిగింది.
ఈ సీజన్‌లోనే మోస్ట్ ఎంటర్‌టైనింగ్ వీడియో అంటూ దెయ్యం టాస్క్‌లో కంటెస్టెంట్స్ హావభావాలు, ఇచ్చిన ఫన్‌ను మరోసారి చూపించారు నాగ్. ఇక ఇంట్లో వున్న గొడవలు చాలవన్నట్లు శ్రీహాన్, రేవంత్ మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారు నాగార్జున. దెయ్యం టాస్క్ సమయంలో గదిలోకి వెళ్లిన అందరి వీడియోలను వేయించిన నాగ్.. రేవంత్ వీడియోను వేయలేదు. దీనిపై రేవంత్ నాగ్‌ను ప్రశ్నించగా... దానికి ఆయన నువ్వు భయపడలేదుగా అందుకే వేయలేదు అని ఆన్సర్ ఇచ్చారు. కావాలని భయపడలేం కదా సార్ అని రేవంత్ అనగా... అంటే శ్రీహాన్ కావాలని భయపడ్డాడని అంటావా అని నాగ్ అన్నారు. దీంతో రేవంత్ దండం పెట్టేశాడు.
తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడున్న వారి కంటే తాము ఎందుకు బెటర్, తమకే ఓట్లు ఎందుకు వేయాలో చెప్పాలని నాగ్ టాస్క్ ఇచ్చారు. తొలుత శ్రీహాన్ మాట్లాడుతూ... తప్పులు చేసినా దానిని ఒప్పుకోగలగాలి, ఆ గుణం రేవంత్‌కు లేదన్నాడు. దీనికి రేవంత్ కలగజేసుకుంటూ... శ్రీహాన్ తన వెనకాల మాట్లాడతాడని తెలుసునంటూ కాస్త కోపం తెచ్చుకున్నాడు. ఈ లోగా ఆదిరెడ్డిని.. ‘‘రేవంత్‌ను శ్రీహాన్ ఫ్లిప్పర్ అన్నాడా’’ లేదా అని ప్రశ్నించారు నాగ్. తనకు గుర్తు లేదని అతను చెప్పగా... నిన్ను మించిన ఫ్లిప్పర్ లేడంటూ చురకలంటించారు నాగ్.
ఇక.. ప్రైజ్‌మనీని పెంచే పనికి నాగార్జున శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా మూడు సూట్ కేసులు తెచ్చిన ఆయన.. అందులో ఎంత డబ్బుంటే అంత ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందని చెప్పారు. దీంతో అంతా కలసి ఒక సూట్‌కేసును పట్టుకుని తెరిచి చూడగా అందులో రూ.3 లక్షలు వుంది. దానిని ప్రైజ్‌మనీకి కలపగా.. రూ.50,00,000 అయ్యింది. ఇదే సమయంలో ఈ సీజన్ విన్నర్... మాత్రం లక్కీ అని చెప్పుకోవచ్చు. టైటిల్ విన్నర్‌కి రూ.50 లక్షల ప్రైజ్ మనీతో పాటు, సువర్ణభూమి వారి రూ.25 లక్షల విలువ చేసే ఫ్లాట్ కూడా ఇస్తామని ముందే ప్రకటించారు. వీటికి అదనంగా మారుతి సుజూకీ బ్రీజా కారును కూడా విన్నర్ అందుకుంటారని నాగ్ ప్రకటించగా... ఇంట్లో వున్న వాళ్ల ముఖాలు బల్బుల్లా వెలిగిపోయాయి.
తర్వాత నాగ్ ఇంటి సభ్యులతో మరో గేమ్ ఆడించాడు. ఓ బోర్డ్‌పై ఇంట్లో వున్న వారి ఫోటోలు పెట్టి.. బెస్ట్ కంటెస్టెంట్ అనుకున్న ముగ్గురికి స్టార్ రేటింగ్ ఇచ్చి, వేస్ట్ అనుకున్న ముగ్గురి ముఖంపై క్రాస్ సింబల్‌ను వేయాలన్నాడు. దీంతో ఇంటి సభ్యులు అలాగే చేశారు. ఆ వెంటనే నామినేషన్స్‌లో వున్న కీర్తి, రేవంత్‌లను సేవ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. దీంతో శ్రీహాన్‌తో పాటు వీరిద్దరూ ఫైనల్ వీక్‌కు వెళ్లిపోయారు. అనంతరం మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో గెస్ చేయాలని ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చాడు నాగ్. దీనికి శ్రీహాన్ రోహిత్ పేరుని, కీర్తి ఆదిరెడ్డిని, రేవంత్ ఇనయాపేరుని చెప్పారు. దీనికి ఇనయా స్పందిస్తూ..... నిన్ననే కదా నేను ఖచ్చితంగా టాప్‌లో వుంటానని చెప్పావు. ఇప్పుడు ఇలా అంటున్నావేంటీ అని ప్రశ్నించింది..
అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఇనయానే అని తెలుస్తోంది. ఇదే నిజమైతే బిగ్‌బాస్ నిర్వాహకులపై ట్రోలింగ్ మామూలుగా వుండదు. లేడీ టైగర్ అని పేరు తెచ్చుకున్న ఇనయాను బయటకు పంపితే ఆమె ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతారు. ఖచ్చితంగా గ్రాండ్ ఫినాలేలో వుండాల్సిన కంటెస్టెంట్‌ని మరొకరి కోసం బలి చేస్తారా అని ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. మరి ఇది ఎంత వరకో తెలియాలంటే రేపటి వరకు ఎయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments