ప్రాజెక్ట్ కే : మీ సాయం కావాలి.. ఆనంద్ మహీంద్రాకు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్‌లో బిజీగా వున్నారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అనేక వాయిదాల అనంతరం మార్చి 11న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తామని స్వయంగా ప్రభాస్ అనౌన్స్ చేశారు. రాధేశ్యామ్‌తో పాటు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలకు ప్రభాస్ నటిస్తున్నారు.
మహానటి ఫేం నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘‘ప్రాజెక్ట్ కే’’ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా... అలాగే అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను సాయం కోరాడు నాగ్ అశ్విన్. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశాడు. ‘‘ డియర్ ఆనంద్ మహేంద్ర సార్… తాము అమితాబ్, ప్రభాస్, దీపికలతో కలిసి ప్రాజెక్ట్ కే అనే సైన్స్ ఫిక్షన్ మూవీని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం మేం రూపొందించే కొన్ని వాహనాలు ప్రత్యేకమైనవి, నేటి సాంకేతికతకు మించినవి కావాలి.
మన దగ్గర ప్రతిభావంతులైన భారతీయ ఇంజనీర్లు, డిజైనర్ల బృందం ఉందని... ఇంతకు ముందు ఇలాంటి సినిమాని ఎవ్వరూ ప్రయత్నించలేదని నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే సినిమా రూపకల్పనలో మీరు మాకు సహాయం చేయగలిగితే గౌరవంగా ఉంటుంది అంటూ ఆ ట్వీట్‌లో తెలిపాడు. దీనిని బట్టి.. ‘‘ప్రాజెక్ట్ కే’’ సినిమాలో ఉపయోగించే వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. మరి నాగ్ అశ్విన్ రిక్వెస్ట్‌కు ఆనంద్ మహీంద్రా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
I admire you a lot sir..v have a talented, fully Indian team of engineers and designers..but the scale of the project is such that we could use a hand..such a film has never been attempted before...it would be an honor if you can help us engineer the future... #ProjectK
— Nag Ashwin (@nagashwin7) March 4, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com