ముంబాయిలో నాగ అన్వేష్ పాటల రికార్డింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కనున్న చిత్రం 'ఏంజిల్'. శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మాతగా బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి యంగ్ టాలెండ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవలే మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'బెంగాల్ టైగర్' కు భీమ్స్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఇక యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న 'ఏంజిల్'కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు భీమ్స్.
తాజాగా ముంబాయ్ లో ప్రముఖ ఆడియో రికార్డింగ్ థియేటర్ లో 'ఏంజిల్' పాటల రికార్డింగ్ మొదలైంది. సంగీత దర్శకుడు భీమ్స్ ఆధ్వర్యంలో టాప్ సింగర్స్ విజయ్ ప్రకాష్, శ్రేయ గోషాల్ అలానే అల్లు అర్జున్ సరైనోడు లో బ్లాక్ బస్టర్ పాట పాడిన నకాష్ అజీజ్ తదితరలు 'ఏంజిల్' కు పాటలు పాడబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఒకవైపు పాటల రికార్డింగ్ ఊపందుకుంటే మరో వైపున ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. కథ చాలా అద్భుతంగా వచ్చిందని త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com