close
Choose your channels

వెంకీకి జోడీగా నదియా?

Sunday, December 24, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `అజ్ఞాత‌వాసి`. ప‌వ‌న్ 25వ చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్‌, సాంగ్స్ ఇటీవ‌ల విడుద‌లై అభిమానుల‌ను అల‌రిస్తున్నాయి. కాగా, ఈ చిత్రంలో సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్ ఓ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆయ‌న రెండు రోజులు షూటింగ్‌లో కూడా పాల్గొన్నార‌ని స‌మాచార‌మ్‌. అంతేకాకుండా.. ఈ పాత్ర‌కి జోడీగా సీనియ‌ర్ న‌టి న‌దియా కూడా తెర‌పై సంద‌డి చేయ‌నుంద‌ట‌. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌ల గ‌త చిత్రం `అత్తారింటికి దారేది`లో న‌దియా అత్త పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు పాత్ర‌లు కూడా అతిథి పాత్ర‌లే అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌త్యేక సంద‌ర్భంలోనే వ‌స్తాయ‌ని తెలిసింది. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత‌మందించారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. జ‌న‌వ‌రి 10న `అజ్ఞాత‌వాసి` విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.