వెంకీకి జోడీగా నదియా?

  • IndiaGlitz, [Sunday,December 24 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'అజ్ఞాత‌వాసి'. ప‌వ‌న్ 25వ చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్‌, సాంగ్స్ ఇటీవ‌ల విడుద‌లై అభిమానుల‌ను అల‌రిస్తున్నాయి. కాగా, ఈ చిత్రంలో సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్ ఓ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆయ‌న రెండు రోజులు షూటింగ్‌లో కూడా పాల్గొన్నార‌ని స‌మాచార‌మ్‌. అంతేకాకుండా.. ఈ పాత్ర‌కి జోడీగా సీనియ‌ర్ న‌టి న‌దియా కూడా తెర‌పై సంద‌డి చేయ‌నుంద‌ట‌. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌ల గ‌త చిత్రం 'అత్తారింటికి దారేది'లో న‌దియా అత్త పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు పాత్ర‌లు కూడా అతిథి పాత్ర‌లే అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌త్యేక సంద‌ర్భంలోనే వ‌స్తాయ‌ని తెలిసింది. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత‌మందించారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. జ‌న‌వ‌రి 10న 'అజ్ఞాత‌వాసి' విడుద‌ల కానుంది.

More News

పోస్ట్ ప్రొడక్షన్లో నిత్య సినిమా

పేరుకి కేరళకుట్టి అయినా..తెలుగువారికి అనతికాలంలోనే దగ్గరైంది నిత్యా మీనన్.అలా మొదలైందితో తెలుగు తెరకు పరిచయమైన ఈ బొద్దుగుమ్మ.

వాయిదా పడ్డ నాని చిత్రం

ఎం.సి.ఎతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు యువ కథానాయకుడు నాని.

'తొలి ప్రేమ' వాయిదా పడనుందా?

తొలిప్రేమ.. తెలుగు తెరపై సంచలనం సృష్టించిన ప్రేమకథా చిత్రమిది.

హీరోకి తల్లి పాత్రలో మీనా

తొలుత బాలనటిగా తెరంగేట్రం చేసి..తరువాత కాలంలో కథానాయికగానూ రాణించారు మీనా.

శ్రీను వైట్ల చిత్రంలో..

హాస్య నటుడిగా కెరీర్ ని ప్రారంభించి..క్రమంగా కథానాయకుడి పాత్రలవైపు అడుగులు వేశారు సునీల్.