పవన్, చెర్రీ తరువాత బన్నీతో..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరపురాని చిత్రాలలో 'అత్తారింటికి దారేది' ఒకటి. ఆ సినిమా విజయంలో సీనియర్ కథానాయిక నదియా పాత్ర కూడా ఎంతో కొంత ఉందనే చెప్పాలి. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తరువాత.. మరో మెగా హీరో నటించిన సినిమాలోనూ ఆమె ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. ఆ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాగా.. ఆ చిత్రం 'బ్రూస్ లీ'. మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
ఇదిలా ఉంటే.. మళ్ళీ మూడేళ్ల తరువాత మరో మెగా హీరో సినిమాలో నదియా దర్శనమివ్వనుంది. ఈ సారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంతు అయ్యింది. ఈ మెగా హీరో ప్రస్తుతం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక కాగా.. అర్జున్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు నదియా కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. పవన్ లాగే బన్నికి కూడా నదియా కలిసొస్తారో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com