అజ్ఞాతవాసిలోనూ ఆమె ఉందా?
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది అత్తారింటికి దారేది. కుటుంబ కథా చిత్రంగా నిరూపొందిన ఈ సినిమా.. ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. ఈ సినిమా విడుదలై నాలుగేళ్లవుతున్నా.. ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటుంటారు. అలాంటి ఆ మూవీలో కీలకమైన అత్త పాత్రలో నదియా సందడి చేసింది. ఆ విజయంలో తానూ ఓ భాగమైంది.
కాగా, అత్తారింటికి దారేది తరువాత పవన్‌తో త్రివిక్రమ్ రూపొందిస్తున్న తాజా చిత్రంలోనూ నదియా ఓ అతిథి పాత్రలో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి అనే పేరు పరిశీలనలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్ జరుపుకుంటోంది. రేపటితో ఈ షెడ్యూల్ పూర్తిచేసి.. సోమవారం నుంచి కాశీలో చివరి షెడ్యూల్ చేయనున్నారు. అదే రోజు ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తోంది చిత్ర బృందం.
కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కుష్బూ, బొమన్ ఇరాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుద్ సంగీతమందిస్తున్నాడు. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com