రేపే నడిగర్ సంఘం కీలక నిర్ణయం
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడులో నడిగర్ సంఘంకి జరిగిన ఎన్నికల్లో శరత్ కుమార్ పై నాజర్ గెలిచిన విషయం తెలిసిందే. నడిగర్ సంఘం అధ్యక్షుడుగా నాజర్, సెక్రటరీగా విశాల్, ట్రజరర్ గా కార్తీ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికయిన నడిగర్ సంఘం సభ్యులు రేపు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ను చెన్నైలోని ఆర్.కె.వి స్టూడియోస్‌లో ఏర్పాటు చేసారు.
ఈ మీటింగ్ లో నడిగర్ సంఘం భవన నిర్మాణం, ఫౌండ్స్ వసూలు చేయడం అనే విషయాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే..విశాల్ వర్గానికి అండగా నిలిచి విజయానికి పరోక్షంగా కారణమైన రజనీకాంత్, కమల్ హాసన్ లకు గౌరవ సలహాదారులుగా పదవులు ఇచ్చే విషయం పై చర్చించే అవకాశం ఉందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com