Nadendla:జగన్ రెడ్డి పాలనలో ఏపీ అంధకారంలో కూరుకుపోయింది.. ఎవరినీ కదిలించినా కన్నీరే..
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం జగన్ రెడ్డి పాలనలో ఏపీ అంధకారంలో కూరుకుపోయిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఎక్కడ చూసినా సమస్యలే.. ఎవరినీ కదిలించినా కన్నీరే కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి, మంత్రులు తమ అధినేత పవన్ కల్యాణ్‌ని వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అనుభవం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనలతో కూడిన కొత్త ప్రభుత్వం తప్పకుండా వస్తుందన్నారు.
జనసేనలో చేరిన మండపేట వైసీపీ నాయకులు..
మండపేట నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు నాదెండ్ల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అథ:పాతాళానికి వెళ్లిపోయిందన్నారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియాలతో అధికార పార్టీ నాయకులు కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నాలున్నర సంవత్సరాల్లో కనీసం ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదన్నారు. సీఎం జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడతున్నారని.. ఏనాడైనా మీ జేబులో నుంచి ఒక్క రూపాయైనా పేదల కోసం ఖర్చు పెట్టారా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నపూర్ణ లాంటి తూర్పుగోదావరి జిల్లాలో 34 మంది కౌలు రైతు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచన్ పవన్ కల్యాణ్ తన సొంత డబ్బులను విరాళంగా ఇచ్చి ఆదుకున్నారని పేర్కొన్నారు.
వైసీపీని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయి..
మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగున్నాయని.. ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్లకూడదనే దురుద్దేశంతోనే అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్భందించారన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన వాలంటీర్ వ్యవస్థలోని లోపాలు గురించి మాట్లాడినందుకు పవన్ కల్యాణ్‌పై కూడా కేసులు పెట్టారన్నారు. వైసీపీని ఇంటికి పంపంచే రోజులు దగ్గర పడ్డాయని.. అందరం కలిసికట్టుగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేద్దామని నాదెండ్ల పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com