న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం: నాదెండ్ల మనోహర్

  • IndiaGlitz, [Friday,February 22 2019]

ఆంధ్రప్రదేశ్‌‌లో వ్యవస్థలను దుర్వినియోగం చేస్తే సహించేది లేదని.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. శుక్రవారం సాయంత్రం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కృష్ణ జలాలను తెనాలికి తీసుకువచ్చింది తన హయాంలోనే అని స్పష్టం చేశారు.

తెనాలి ప్రాంతానికి తీసుకు వచ్చిన కృష్ణా జలాలను తెనాలి పట్టణ ప్రాంత ప్రజలకే వినియోగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి నాదెండ్ల సూచించారు. భవిష్యత్తులో ప్రజలు నీటి అవసరాలకు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

రక్షిత మంచినీటి పథకాన్ని ఏవ్యక్తికో, సంస్థకో ఉపయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ముఖ్యంగా నాబార్డ్ నిధులు దుర్వినియోగం పై విచారణ జరపాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేయాలి అంతే తప్ప.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం దారుణమన్నారు. కాగా నాదెండ్ల వ్యాఖ్యలకు టీడీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

వరుస ట్వీట్లతో టీడీపీ, వైసీపీని వణికిస్తున్న జనసేనాని!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో... గత కొన్ని రోజులుగా వైసీపీ-జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాని అందుకే ఒకర్నోకరు విమర్శించుకోలేదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తిరుమలలో హిస్టరీ క్రియేట్ చేసిన రాహుల్

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమలలో అరుదైన రికార్డు సృష్టించారు. కేవలం ఒక గంట యాభై నిమిషాల్లోనే కాలినడకను కొండపై ఉన్న తిరుమల వెంకన్న చెంతకు చేరుకున్నారు.

వేసవిలో అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ 'తుంబా'

యువ తమిళ సంగీత సంచలనం అనిరుద్ రాజేంద్రన్ భయపడ్డాడు! 'కొలవెరి డీ' కుర్రాడి ముందుకు ఒక్కసారిగా పులి రావడంతో కంగారు పడ్డాడు! తన మనుషులను పిలుస్తూ కేకలు పెట్టాడు!

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ దర్శకులు, హిట్ సినిమాల కేరాఫ్‌‌గా పేరుగాంచిన కోడి రామకృష్ణ తుదిశ్వాస విడిచారు.

శామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసిందోచ్..

టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కస్టమర్స్‌ కోసం సరికొత్త మోడల్స్‌‌ను శామ్‌సంగ్ రిలీజ్ చేస్తున్న విషయం విదితమే. దక్షిణ కొరియాకు చెందిన ఈ ప్రముఖ మల్టీనేషనల్ కమ్యూనికేషన్