న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం: నాదెండ్ల మనోహర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థలను దుర్వినియోగం చేస్తే సహించేది లేదని.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. శుక్రవారం సాయంత్రం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కృష్ణ జలాలను తెనాలికి తీసుకువచ్చింది తన హయాంలోనే అని స్పష్టం చేశారు.
తెనాలి ప్రాంతానికి తీసుకు వచ్చిన కృష్ణా జలాలను తెనాలి పట్టణ ప్రాంత ప్రజలకే వినియోగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి నాదెండ్ల సూచించారు. భవిష్యత్తులో ప్రజలు నీటి అవసరాలకు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
రక్షిత మంచినీటి పథకాన్ని ఏవ్యక్తికో, సంస్థకో ఉపయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ముఖ్యంగా నాబార్డ్ నిధులు దుర్వినియోగం పై విచారణ జరపాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేయాలి అంతే తప్ప.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం దారుణమన్నారు. కాగా నాదెండ్ల వ్యాఖ్యలకు టీడీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments