Nachindi Girl Friend: సుకుమార్ చేతుల మీదుగా "నచ్చింది గర్ల్ ఫ్రెండూ" నుంచి 'ఎర్రతోలు పిల్లా..' లిరికల్ సాంగ్ రిలీజ్

  • IndiaGlitz, [Friday,September 16 2022]

యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్ గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు.

శుక్రవారం ఈ చిత్రం నుంచి 'ఎర్రతోలు పిల్లా..' అనే లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ విడుదల చేశారు. పాట క్యాచీగా బాగుందన్న ఆయన చిత్రబృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ పాటను గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో గిరి కోడూరి సాహిత్యాన్ని అందించగా ధనుంజయ్ పాడారు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు
రాబోతోంది.

నటీ నటులు: ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, మధునందన్, సీనియర్ హీరో సుమన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, గాయత్రి భార్గవి, కళ్యాణ్ తదితరులు

More News

Today Movie Releases : థియేటర్‌లపై చిన్న సినిమాల దండయాత్ర....ఈ రోజు ఎన్ని రిలీజ్‌లో తెలుసా..?

గత కొన్నిరోజులుగా బడా సినిమాలన్నీ థియేటర్లపై దండయాత్ర చేశాయి. వీటిలో జనాన్ని ఆకట్టుకున్నది కొన్నే అయినప్పటికీ..

BiggBoss: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉద్విగ్న వాతావరణం.. కంటెస్టెంట్స్‌ని ఏడిపించిన సుదీప కథ

గత కొన్నిరోజులుగా గొడవలు, అలకలు, వాగ్వాదాలతో నడిచిన బిగ్‌బాస్ హౌస్‌లో ఈరోజు మాత్రం ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది.

Sree Vishnu : ఇండస్ట్రీలో ‘‘బ్యాక్‌గ్రౌండ్‌’’ పై హీరో శ్రీవిష్ణు సంచలన వ్యాఖ్యలు

తన మార్క్ సినిమాలు చేస్తూ ఈ తరం నటుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రీవిష్ణు.

BiggBoss: ఇట్స్ రివేంజ్ టైమ్.. గీతూ, ఫైమాలపై పగ సాధించిన రేవంత్

బిగ్‌బాస్ 6 రెండవ వారంలో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న సిసింద్రీ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్ ఇంట్లోకి బొమ్మలను పంపారు.

Swathimuthyam : 'స్వాతిముత్యం' టీజర్ ట్రైలర్' విడుదల

‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'.