తొలి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నభా నటేష్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంతోమంది పరభాషా నాయికలు వస్తున్నారు. అలా వచ్చినవారంతా ఏదో ఒక ముద్ర వేస్తున్నారు. కానీ ఏ కొందరికో మాత్రమే ‘అల్లరి పిల్ల’ అనే ముద్ర పడుతుంది. ఎంతో ఛలాకీగా ఉంటే తప్ప ఈ ముద్ర పడదు. కొన్నేళ్ల క్రితం రాధిక ఇలాంటి అల్లరి పాత్రల్లో ఆకట్టుకునేది. ఆ తర్వాత మళ్లీ అలాంటి నాయికను చూడ్డానికి మనవాళ్లకు చాలా కాలమే పట్టింది.
కొంతలో కొంత అష్టాచెమ్మా సినిమాలో స్వాతి ఆకట్టుకున్నా.. బొమ్మరిల్లుతో అల్లరి పిల్ల అంటే హాసిని అన్నంతగా ముద్రవేసింది జెనీలియా. మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు మరో అల్లరి పిల్ల వచ్చింది తెలుగు పరిశ్రమకు. కాకపోతే తనకు ఈ ముద్ర మొదటి సినిమాతోనే పడటం విశేషం. తను మరెవరో కాదు.. నభా నటేష్.
సుధీర్ బాబు నిర్మించి, కథానాయకుడుగా నటించిన సినిమా ‘నన్నుదోచుకుందువటే’. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటోన్నది హీరోయిన్ నభా నటేష్ గురించే. సినిమా ఆసాంతం తన అల్లరితో ప్రేక్షకులను కట్టిపడేసిందీ కన్నడ సోయగం. సినిమాలో సగానికి పైగా తన అల్లరికే ఎక్కువ మార్కులు పడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఫస్ట్ హాఫ్ లో తన అల్లరికి ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. సెకండ్ హాఫ్ లో అద్భుతమైన ఎమోషన్స్ నూ పండించి తనలో నటనా ప్రతిభ కూడా ఉందని నిరూపించుకుంది.
అయినా ఇదంతా దర్శకుడి ప్రతిభ వల్లే అని వినమ్రంగా చెబుతోన్న ఈ భామ మొదటి సినిమాకే తెలుగునూ నేర్చుకుంది. ప్రస్తుతం అన్ని ఇంటర్వ్యూస్ లో గళగళా తెలుగులోనే మాట్లాడుతూ మనవారికి మరింత చేరువవుతోంది. ఇప్పుడు పెద్ద హీరోల సరసన నటించే చాన్సులు కూడా వస్తున్నాయి. గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా వెనకాడనని చెబుతోంది కాబట్టి.. తనకు మంచి కమర్షియల్ హీరోయిన్ గా ఎదిగే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందం, ప్రతిభ రెండూ ఉన్న నభా తెలుగులో టాప్ హీరోయిన్స్ లో ఒకరు అవుతుందనటంలో సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com