Naatu Naatu: ఆస్కార్ వేదికపై మరోసారి 'నాటునాటు' పాట.. నగ్నంగా స్టేజ్ పైకి వచ్చిన నటుడు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆస్కార్ అవార్డ్స్ వేడుక అమెరికాలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మన తెలుగు పాట మరోసారి అలరించింది. గతేడాది RRR మూవీలోని 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఆస్కార్ 2024లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ను ప్రకటించేందుకు అరియానా గ్రాండే, సింథియా ఎరివో స్టేజిపైకి చేరుకున్నప్పుడు గతేడాది విజేతగా నిలిచిన ‘నాటునాటు’ పాట బిగ్స్క్రీన్పై తళుక్కున మెరిసింది. చెర్రీ, తారక్ హుక్ స్టెప్ ప్రదర్శించారు.
ఆస్కార్ విజేతలను ప్రకటించే ముందు నామినేషన్స్ పొందిన వాళ్ళ వివరాలతో కూడిన వీడియో ప్లే చేస్తారు. అనంతరం ఆ కేటగిరిలో గతేడాది అవార్డు అందుకున్నది ఎవరో కూడా చూపిస్తారు. ఆస్కార్స్ 2023లో బెస్ట్ ఒరిజనల్ సాంగ్‌లో'నాటు నాటు' పాట విజేతగా నిలవడంతో ఆ సాంగ్ విజువల్స్ చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను RRR మూవీ అధికారిక పేజీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ‘ఆస్కార్ వేదికపై మరోమారు’ అని దానికి క్యాప్షన్ ఇచ్చింది.ఈ ఏడాది బిల్లీ ఇల్లిస్, ఫిన్నీ ఒ‘కానెల్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకున్నారు. కాగా ఈ ఏడాది గ్రెటా గెర్విగ్స్ దర్శకత్వం వహించిన ఫాంటసీ, కామెడీ మూవీ బార్బీ’లోని ‘వాట్ వజ్ ఐ మేడ్ ఫర్’పాటకు గాను ఈ పురస్కారం లభించింది.
మరోవైపు ఈ అవార్డు వేడుకల్లో ఊహించిన ఘటన జరిగింది. WWE ప్లేయర్ జాన్ సీనా.. ఆ డ్రెస్సింగ్ సెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. నగ్నంగా స్టేజ్ మీదకు వచ్చి షాక్‌కు గురిచేశాడు. బెస్ట్ క్యాస్ట్యూమ్ డిజైన్ అవార్డు అందించేందుకు సీనా వేదికపైకి వచ్చాడు. జాన్ రావడానికి ముందు హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ అవార్డు ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో వేదికపై ఓ మేల్ స్ట్రీకర్ నగ్నంగా పరిగెత్తిన ఘటన గుర్తు చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు వస్తాడని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించాడు. ఆ వెంటనే సీనాని పిలవడంతో అతడు ఓ అట్టముక్కను అడ్డుగా పెట్టుకుని నగ్నంగా స్టేజిపైకి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోష్ల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా 1974 ఆస్కార్ అవార్డుల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అప్పట్లో ఓ మేల్ స్ట్రీకర్ ఇలాగే నగ్నంగా స్టేజీపై పరిగెత్తడంతో వేడుకలకు అంతరాయం ఏర్పడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com