Golden Globe: టాలీవుడ్‌ను మరో మెట్టెక్కించిన ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు 'గోల్డెన్ గ్లోబ్'
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన సోదరుడు , సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో కలిసి టాలీవుడ్‌ని మరో మెట్టెక్కించారు.జక్కన్న దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ చిత్రంలోని ‘‘నాటు నాటు’’ పాటకు ప్రపంచ ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటుకు ఈ పురస్కారం దక్కింది. దీంతో టాలీవుడ్ సంబరాల్లో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్‌కి, దర్శకుడు కీరవాణికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
దేశం గర్విస్తోందన్న చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి సంతోషం మామూలుగా లేదు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని తెలిపారు. ఇదొక చారిత్రాత్మక విజయమని.. మిమ్మిల్ని చూసి దేశం గర్విస్తోందన్నారు. మ్యూజిక్, డ్యాన్స్.. ఈ రెండింటి సెలబ్రేషనే నాటు నాటు అన్న ఆయన.. ఇవాళ ప్రపంచమే మీతో కలిసి డ్యాన్స్ చేస్తోందన్నారు. ఈ పాటలో నర్తించిన చరణ్, ఎన్టీఆర్.. గేయ రచయిత చంద్రబోస్.. ఆలపించిన రాహుల్, కాలభైరవ.. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌ను చిరంజీవి అభినందించారు.
ఏఆర్ రెహమాన్ స్పెషల్ విషెస్:
ఇక.. ఆస్కార్ అవార్డ్ విజేత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం ఆర్ఆర్ఆర్ యూనిట్‌ని అభినందించారు. భారతీయులందరి తరపున కీరవాణి, రాజమౌళి, మొత్తం చిత్ర యూనిట్‌కి రెహమాన్ కాంగ్రాట్స్ చెప్పారు.
1200 వందల కోట్ల వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్:
ఇదిలావుండగా.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లో విశేషాలు బోలెడు. తెలుగు సినిమాను శాసించే రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వారసులు కలిసి నటిస్తే చూడాలని కలలు కన్న వారికి దానిని నిజం చేసి చూపారు జక్కన్న. ఎన్టీఆర్ - రామ్‌చరణ్ హీరోలుగా నటించగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవ్‌గణ్, అలియా భట్‌లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో దీనికి మరింత హైప్ వచ్చింది. శ్రీయా శరణ్, సముద్రఖని తదితరులు కీలకపాత్ర పోషించారు. మార్చి 24న రిలీజైన ఈ సినిమా సౌత్ , నార్త్ , ఓవర్సీస్ రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్ల కలెక్షన్స్ సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.
#NaatuNaatu is all about the celebration of Music 🎶 & Dance 🕺
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 11, 2023
India & the World is dancing with you today!!
Kudos @tarak9999 @AlwaysRamCharan @boselyricist for the fabulous lyrics!@kaalabhairava7 @Rahulsipligunj
Danayya garu @DVVMovies @goldenglobes #GoldenGlobes pic.twitter.com/U77CjQclyC
Incredible ..Paradigm shift🔥👍😊👌🏻 Congrats Keeravani Garu 💜from all Indians and your fans! Congrats @ssrajamouli Garu and the whole RRR team! https://t.co/4IoNe1FSLP
— A.R.Rahman (@arrahman) January 11, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments