నాలో ప్రేమ నువ్వేనా లొగొ లాంఛ్
Send us your feedback to audioarticles@vaarta.com
జై చిరంజీవ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై వాసు దేవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తొన్న చిత్రం "నాలో ప్రేమ నువ్వేనా". చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవలె ఈ చిత్ర లొగొను ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కె.నాయుడు ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు విషెష్ ను తెలియచెశారు.
హీరో,దర్శకుడు వాసు దేవ్ మాట్లాడుతూ.. "నాలో ప్రేమ నువ్వేనా" న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ప్రేమ కథా చిత్రాల్లొ ఇదోక వైవిధ్యమైన సినిమాగా నిలిచిపొతుంది. చోటా గారు చిత్ర లొగొను ఆవిష్కరించారు. త్వరలొనె పాటలను విడుదల చెస్తాం. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను సమ్మర్ లొ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.
వాసుదేవ్ , అవని, రాశీ సైనా, సంజయ్ శివ లింగమ్ ,రాజు తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: అర్జున్, కూర్పు: నర్సింగ్ రాథోడ్, కెమెరా: సాంబమూర్తి, కొరియోగ్రఫీ: మగీ, పాటలు: వేలూరి శివబ్రహ్మ శాస్త్రీ. దర్శకత్వం : వాసుదేవ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com