సోషల్ మీడియాను దున్నేస్తున్న ‘నాది నక్కిలీసు గొలుసు’..
Send us your feedback to audioarticles@vaarta.com
‘నాది నక్కిలీసు గొలుసు’ సాంగ్ వినని వారు ఎవరైనా ఉన్నారా? అని ఇప్పుడు అడగటం ఫూలిష్ నెస్ అవుతుందేమో.. అంతగా ఈ సాంగ్ పాపులర్ అయిపోయింది. ఎక్కడ విన్నా ఇదే సాంగ్.. ఎన్నెన్నో వేరియేషన్స్‌లో చేసి ఈ సాంగ్‌పై ఉన్న క్రేజ్‌ను యూత్ ప్రదర్శిస్తోంది. అయితే ఎన్ని వేరియేషన్స్ వచ్చినా అన్నింటినీ ప్రజానీకం ఆదరిస్తూనే ఉంది. ఇటీవలి కాలంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో..’ని ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ సాంగ్ కూడా ఇంతే పాపులర్ అయింది. రికార్డులు మీద రికార్డులు కొల్లగొట్టింది. కానీ ఆ సాంగ్‌కు వేరియేషన్స్ అంటూ ఎవరూ పెద్దగా చేయలేదు. కానీ ‘నాది నక్కిలీసు గొలుసు’ సాంగ్‌కు మాత్రం వారానికి ఒకటి.. రెండు వేరియన్స్ వస్తూనే ఉన్నాయి.
కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పలాస 1978’ చిత్రంలోదే ‘నాది నక్కిలీసు గొలుసు’ సాంగ్. రఘు కుంచె సంగీతం అందించడమే కాకుండా ఆయనే స్వయంగా ఆలపించారు. ఈ సాంగ్‌కు యూత్ ఫిదా అయిపోయారు. ఈ సాంగ్ విడుదల సమయంలో కంటే టిక్‌టాక్ స్టార్ దుర్గారావు ఈ పాటకు డ్యాన్స్ చేయడంతో మరింత పాపులర్ అయిపోయింది. ఈ పాటకు ‘ఢీ’లో ఓ కంటెస్టెంట్ డ్యాన్స్ చేయడమే కాకుండా పాట మధ్యలో దుర్గారావును సైతం తీసుకురావడంతో ఇక ఈ సాంగ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ పాటకు విపరీతంగా వ్యూస్ వచ్చాయి. దీంతో అత్యధిక వ్యూస్ సంపాదించుకున్న పాటగా రికార్డ్‌కెక్కింది.
ఇక అక్కడి నుంచి మొదలు ఈ పాటకు ఎవరికి తోచిన రీతిలో వారు వేరియేషన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఇంకా వేరియేషన్స్ వస్తూనే ఉన్నాయంటూ ఆ వీడియోలను ఫేస్బుక్లో అభిమానులతో పంచుకున్నారు. ఈ పాటకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ సాంగ్‌కు చేసిన డ్యాన్స్‌ను జోడించి పవన్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిని చూసిన రఘు కుంచె ఉప్పొంగిపోయారు. తనకు పవన్‌తో పని చేసే అవకాశం ఒకసారి వచ్చిందని.. అది కొందరి కారణంగా చేజారిపోయిందని.. అవకాశం వస్తే సీట్లు సిరిగిపోవాల్సిందేనని రఘు కుంచె పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments