'నా రూటే సెపరేటు' పోస్టర్ ఆవిష్కరణ
Send us your feedback to audioarticles@vaarta.com
అలీరాజా, మధుమిత కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం నా రూటే సెపరేటు`. ఐశ్వర్య అడ్డాల మరో నాయిక. జెన్నీఫర్ ప్రత్యేక గీతంలో కనిపిస్తుంది. గిరిధర్ దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స పతాకంపై ఎం.సుబ్బలక్ష్మి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు.
అనంతరం దర్శకుడు గిరిధర్ మాట్లాడుతూ... ఈజీ మనీ నేపథ్యంలో సాగే చిత్రమిది. నేటితరం యువత ఈజీ మనీ కోసం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఏ విధంగా మళ్లీ దార్లోకి వస్తున్నారు అన్నది ఈ చిత్రంలో ప్రధానాంశం. కథ, కథనం ఆసక్తికరంగా ఉంటుంది. పూర్తిస్థాయి వినోదాన్ని పంచే చిత్రమిది. అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంటుంది అని అన్నారు.
నిర్మాత వామనరావు మాట్లాడుతూ... షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో పాటల్ని విడుదల చేసి వచ్చే నెలలో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని చెప్పారు. లజ్జ తర్వాత నటనకు ఆస్కారమున్న పాత్రలో నటించానని హీరోయిన మధుమిత కృష్ణ తెలిపారు.
అలీ, జెన్నీఫర్, వినోద్,ర్రనపసాద్‌బాబు, శేషు వెంకీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వి.వి.వామనరావు, కెమెరా: ఎన.సుధాకర్‌రెడ్డి, సంగీతం: నందనరాజ్ బొబ్బిలి, ఎడిటింగ్: శివ గుంటూరు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com