మాల్స్‌లో నా పేరు సూర్య
Send us your feedback to audioarticles@vaarta.com
దువ్వాడ జగన్నాథమ్ తరువాత అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నాపేరు సూర్య. నా ఇల్లు ఇండియా అనేది దీనికి ట్యాగ్‌లైన్. రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మెగాబ్రదర్ నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ లగడపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ సంగీత దర్శకద్వయం విశాల్ శేఖర్ సంగీతమందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని కొన్ని మాల్స్‌లో జరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ చూస్తే.. వంశీ ఓ కొత్త దర్శకుడిలా సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా లేదని.. ఎన్నో చిత్రాలను రూపొందించిన దర్శకుడిలా నాపేరు సూర్యని తెరకెక్కిస్తున్నారని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ విషయంలో చిత్ర నిర్మాతలు సంతోషంగా ఫీలవుతున్నారని చిత్ర బృందం చెప్పుకొస్తోంది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ కథానాయకుడు అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏప్రిల్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments