'నా పేరు సూర్య..' శాటిలైట్ రైట్స్ సంచలనం
- IndiaGlitz, [Wednesday,January 17 2018]
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఊరు ఇండియా'. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు అర్జున్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్న ఈ సినిమాని లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం బన్నీ మేకోవర్ అయిన తీరు.. ఆయన అభిమానులను ఫిదా చేసేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌కి సంబంధించిందిన ఓ ఆసక్తికరమైన విషయం టాలీవుడ్ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇంతకీ అదేమిటంటే.. జీ తెలుగు చానల్ ఈ సినిమాని రూ.15 కోట్ల వరకు కొనుగోలు చేసిందని తెలిసింది. బన్ని గత చిత్రం దువ్వాడ జగన్నాథమ్ శాటిలైట్ రైట్స్‌ని అదే జీ తెలుగు సంస్థ రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు నా పేరు సూర్య రైట్స్ అంతకుమించి ఉండడం వార్తల్లో నిలుస్తోంది. ఏప్రిల్ 27న ఈ సినిమా విడుదల కానుంది.