'నా పేరు సూర్య'.. మెసేజ్ ఏమిటంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. నేటి సమాజంలో ఎవరైతే దేశానికి తక్కువ ప్రాధాన్యతని ఇస్తూ...స్వార్ధంగా జీవిస్తున్నారో....అటువంటి వారికోసం ఈ సినిమా ద్వారా బలమైన సందేశం ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడిస్తోంది.
సైనికుడికి దేశం కంటే ఏది ముఖ్యం కాదు. తన దేశం కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడడు. చివరికి ప్రాణాలివ్వడానికైనా, తీయడానికైనా సిద్ధపడతాడు. అటువంటి పాత్రలో బన్నీ నటిస్తున్నాడట. సైనికుడి గొప్పతనాన్ని చాటేలా ఒక పాటని కూడా ఈ సినిమాలో పెట్టమని బన్నీ చెప్పాడట.
అదే.. గీత రచయిత రామజోగయ్యశాస్రి రచించిన "ఓ సైనికుడా, దిల్లే ఇండియా ఇల్లే ఇండియా". ఇటీవల విడుదలైన ఈ పాటకి మంచి స్పందన వస్తోంది. కాగా, ఈ చిత్రంలో సీనియర్ నటులు అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మెగాబ్రదర్ నాగబాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, శిరీష, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com