'నా పేరు సూర్య'.. మెసేజ్‌ ఏమిటంటే..

  • IndiaGlitz, [Monday,January 29 2018]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ర‌చ‌యిత వక్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. నేటి సమాజంలో ఎవరైతే దేశానికి తక్కువ ప్రాధాన్యతని ఇస్తూ...స్వార్ధంగా జీవిస్తున్నారో....అటువంటి వారికోసం ఈ సినిమా ద్వారా బలమైన సందేశం ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడిస్తోంది.

సైనికుడికి దేశం కంటే ఏది ముఖ్యం కాదు. తన దేశం కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడడు. చివరికి ప్రాణాలివ్వడానికైనా, తీయడానికైనా సిద్ధపడతాడు. అటువంటి పాత్రలో బన్నీ నటిస్తున్నాడ‌ట‌. సైనికుడి గొప్పతనాన్ని చాటేలా ఒక పాటని కూడా ఈ సినిమాలో పెట్టమని బన్నీ చెప్పాడ‌ట‌.

అదే.. గీత రచయిత రామ‌జోగ‌య్య‌శాస్రి ర‌చించిన‌ "ఓ సైనికుడా, దిల్లే ఇండియా ఇల్లే ఇండియా". ఇటీవల విడుదలైన ఈ పాటకి మంచి స్పంద‌న వస్తోంది. కాగా, ఈ చిత్రంలో సీనియర్ నటులు అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మెగాబ్రదర్ నాగబాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, శిరీష, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

వేసవి కానుకగా నితిన్ 25

యువ కథానాయకుడు నితిన్ హీరోగా నటించిన 25వ సినిమాని ‘రౌడీ ఫెలో’

భాగమతి చిత్రాన్ని ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు - అనుష్క

అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం సూపర్ హిట్ టాక్ తో...

సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నిన్నే చూస్తు

వీరభద్ర క్రియేషన్స్ పతాకం పై నూతన నటీనటులు శ్రీకాంత్ మరియు హేమలత(బుజ్జి) హీరో హీరోయిన్ గా

ప్రేమికుల రోజు కానుక‌గా 'రంగ‌స్థ‌లం' తొలి పాట‌

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్ర‌స్తుతం 'రంగస్థలం' చిత్రంలో క‌థానాయ‌కుడిగా నటిస్తున్న‌ విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సమంత కథానాయికగా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైన‌ర్‌గా సాగే ఈ గ్రామీణ నేపథ్యపు చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ‌ నిర్మిస్తోంది.

కాజ‌ల్‌.. చిన‌నాటి క‌ల‌

గ‌తేడాది.. కాజ‌ల్ అగ‌ర్వాల్  కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. చిరంజీవి రీ-ఎంట్రీ ఫిలిం 'ఖైదీ నంబర్ 150'లో కథానాయికగా సంద‌డి చేసిన కాజ‌ల్‌...ఎప్పటినుంచో విజయం కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రానా సరసన 'నేనే రాజు నేనే మంత్రి'లో హీరోయిన్‌గా నటించింది.