ఆ మూడు చిత్రాల బాట‌లో 'నా పేరు సూర్య‌'?

  • IndiaGlitz, [Monday,April 23 2018]

'అర్జున్ రెడ్డి, రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను'.. ఈ మూడు సినిమాల‌కి సంబంధించి ఓ అంశం ఉమ్మ‌డిగా ఉంది. అదేమిటంటే.. దాదాపు 3 గంట‌ల నిడివితో రూపొంది.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన‌, కురిపిస్తున్న సినిమాలు ఇవి. ఇప్పుడు ఈ సినిమాల జాబితాలోనే మ‌రో సినిమా కూడా చేర‌నుంద‌ని స‌మాచారం. అదే అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.

ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం మే 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ సినిమా నిడివి దాదాపు మూడు గంట‌లు (2 గంట‌ల 47 నిమిషాలు) ఉంద‌ని తెలుస్తోంది. కంటెంట్ బాగుంటే.. నిడివితో సంబంధం లేద‌ని అర్జున్ రెడ్డి, రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను చిత్రాలు నిరూపించ‌డంతో.. నా పేరు సూర్య నిడివి విష‌యంలో నిర్మాత‌లు పెద్ద‌గా ప‌ట్టింపుల‌కి పోవ‌డం లేద‌ని తెలుస్తోంది. మ‌రి.. నా పేరు సూర్య కూడా ఎక్కువ నిడివితో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తాడో లేదో చూడాలి.

More News

మెగా హీరో కోసం పూరీ పొలిటిక‌ల్ స‌బ్జెక్ట్‌?

'పోకిరి' వంటి సంచ‌ల‌న విజ‌యంతో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌.

మహేష్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ భారీ చిత్రం

'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు

అమ్మ బ‌ర్త్‌డే.. మ‌హేష్‌కు క‌లిసొచ్చింది

బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్‌.. ఇలా బ్యాక్ టు బ్యాక్ ప‌రాజ‌యాల‌తో నిరాశ‌ప‌డ్డ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబుకు,

త‌క్కువ గ్యాప్‌లోనే వ‌స్తున్న నాగ్‌

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు నాగార్జున గ‌త రెండేళ్ళుగా రెండు లేదా అంత‌కుమించిన చిత్రాల‌తో సంద‌డి చేస్తున్నారు.

టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా' కొత్త చిత్రం ప్రారంభం

Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో