ఆ మూడు చిత్రాల బాట‌లో 'నా పేరు సూర్య‌'?

  • IndiaGlitz, [Monday,April 23 2018]

'అర్జున్ రెడ్డి, రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను'.. ఈ మూడు సినిమాల‌కి సంబంధించి ఓ అంశం ఉమ్మ‌డిగా ఉంది. అదేమిటంటే.. దాదాపు 3 గంట‌ల నిడివితో రూపొంది.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన‌, కురిపిస్తున్న సినిమాలు ఇవి. ఇప్పుడు ఈ సినిమాల జాబితాలోనే మ‌రో సినిమా కూడా చేర‌నుంద‌ని స‌మాచారం. అదే అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.

ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం మే 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ సినిమా నిడివి దాదాపు మూడు గంట‌లు (2 గంట‌ల 47 నిమిషాలు) ఉంద‌ని తెలుస్తోంది. కంటెంట్ బాగుంటే.. నిడివితో సంబంధం లేద‌ని అర్జున్ రెడ్డి, రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను చిత్రాలు నిరూపించ‌డంతో.. నా పేరు సూర్య నిడివి విష‌యంలో నిర్మాత‌లు పెద్ద‌గా ప‌ట్టింపుల‌కి పోవ‌డం లేద‌ని తెలుస్తోంది. మ‌రి.. నా పేరు సూర్య కూడా ఎక్కువ నిడివితో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తాడో లేదో చూడాలి.