'నా పేరు సూర్య' డైలాగ్ ఇంపాక్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన వారంతా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు. ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా ఈ నెల 8న డైలాగ్ ఇంపాక్ట్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి... ప్రపంచవ్యాప్తంగా మే 4న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా... వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ... గ్రాండియర్ గా “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మా హీరో ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో మీకు తెలిసిందే. బన్నీ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 8న డైలాగ్ ఇంపాక్ట్ టీజర్ రేలీజ్ చేస్తున్నాం. మరో వైపు విశాల్ శేఖర్ అద్భుతమైన సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments