'నా పేరు రాజా' టీజర్ లాంచ్!!
Send us your feedback to audioarticles@vaarta.com
అమోఘ్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై రాజ్ సూరియన్ హీరోగా ఆకర్షిక, నస్రీన్ హీరోయిన్స్ గా అశ్విన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నా పేరు రాజా`. రాజ్ సూరియన్, ప్రభాకర్ రెడ్డి, కిరణ్ రెడ్డి నిర్మాతలు. తెలుగు, కన్నడ రెండు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం ఫిలించాంబర్ లో జరిగింది.
ఈ సందర్బంగా హీరో రాజ్ సూరియన్ మాట్లాడుతూ... ``నేను హీరోగా తిరుగుబోతు, జటాయువు సినిమాలు చేసాను. `నా పేరు రాజా` నా మూడో సినిమా. ఇది తెలుగు, కన్నడ రెండు భాషల్లో రూపొందిస్తున్నాం. దర్శకుడు అశ్విన్ అద్బుతమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో రొమాంటిక్, యాక్షన్ , లవర్ బాయ్ ఇలా త్రి షేడ్స్ తో నా క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పటికే కన్నడ లో సెన్సార్ కంప్లీట్ అయ్యింది. కానీ తెలుగు లో మాత్రం సెన్సార్ ఇవ్వడానికి ఎందుకో లేట్ చేస్తున్నారు. సీరియల్ ప్రకారం చేయకుండా వెనక వచ్చిన పెద్ద సినిమాలకు సెన్సార్ ఇస్తున్నారు. ఎమన్నా అంటే ఇక్కడ పద్దతి మీకు తెలియదంటున్నారు. ఇదేమీ పద్ధతో నాకు తెలియడం లేదు. అనుకున్న ప్రకారం సెన్సార్ కంప్లీట్ అయితే జనవరి 31న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ నెల 20న ట్రైలర్ రిలీజ్ చేస్తాం`` అన్నారు .
నిర్మాత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... `` నిర్మాతగా ఇది నా మూడో సినిమా. మనాలి, హైదరాబాద్, కేరళ లో షూటింగ్ పూర్తి చేసాం. ఇందులో లవ్, కామెడీ, యాక్షన్ ఇలా ఆడియన్స్ కు కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ మెండుగా ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన లిరికల్ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాను జవవరి 31న రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.
సినిమాటోగ్రాఫర్ వెంకట్ మాట్లాడుతూ...``డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను డైరక్టర్ ప్రతి సీన్ అద్బుతంగా తీసాడు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా అన్ని విధాల సహకరించారు`` అన్నారు.
హీరోయిన్ నస్రీన్ మాట్లాడుతూ...`` ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో హాట్ రోల్ చేశాను`` అన్నారు.
మరో హీరోయిన్ ఆకర్షిక మాట్లాడుతూ...``ఇప్పటికే రిలీజ్ అయినా లిరికల్ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో సినిమాను పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా`అన్నారు.
దర్శకుడు అశ్విన్ కృష్ణ మాట్లాడుతూ...``డైరక్టర్ గా ఇది నా తొలి సినిమా. ఉపేంద్ర , మురళీమోహన్ గార్ల వంటి పెద్ద డైరక్టర్స్ వద్ద నేను దర్శకత్వ శాఖలో గత 20 ఏళ్లుగా పని చేస్తున్నా. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. హీరో క్యారక్టర్ లో త్రీ షేడ్స్ ఉంటాయి. అవి ఏంటనేవి స్క్రీన్ పైనే చూడాలి. అలాగే ఇద్దరు హీరోయిన్స్ పాత్రలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. తెలుగు, కన్నడలో రూపొందుతోన్న బైలింగ్వల్ ఫిలిం ఇది. లవ్, ఎమోషన్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని రకాల కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించాం. మా టీం అందరి సమిష్టి కృషి వల్లే సినిమా చేయగలిగాను``అన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః ఎల్విన్ జాషువా, సినిమాటోగ్రాఫర్ః ఎ.వెంకట్; ఎడిటర్ః వెంకీ యుడివి; ఫైట్స్ః థ్రిల్లర్ మంజు, మాస్ మాద; కొరియోగ్రాఫర్ః నగేష్.వి; లిరిక్స్ః శ్రీమణి, సాహితి, అర్మాన్; నిర్మాతలుః రాజ్ సూరియన్, కిరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి; రచన-దర్శకత్వంః అశ్విన్ కృష్ణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments