Naa Nuvve Review
హీరో హీరోయిన్ అనుకోకుండా కలవడం.. లవ్ అనే మ్యాజిక్‌లో పడటం. కొన్ని రోజులు గాఢంగా ప్రేమించుకోవడం.. అనుకోకుండా చిన్న చిన్న మనస్పర్ధలు వల్ల విడిపోవడం. కొన్నాళ్లు కలవకపోవడం. మళ్లీ కలుసుకోవడం.. ప్రేమకథా చిత్రాలంటే ఇలానే ఉంటాయి. మరి ప్రేమకథా చిత్రాలు ఎలా సక్సెస్ సాధిస్తున్నాయి? అని ప్రశ్నిస్తే.. ప్రెజెంటేషన్‌లోని కొత్తదనాన్ని ప్రేక్షకులు ఫీల్ అయితే.. ఆ సినిమాకు ఇక తిరుగుండదు. అలాంటి ఓ కొత్త ఫీల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తానంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేమకథా చిత్రం `నా నువ్వే`. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాలో హీరోగా నటించిన కల్యాణ్ రామ్... తొలిసారి రొమాంటిక్ సినిమాలో నటిస్తుండటం. ఈ జోనర్ సినిమాకు ఈ హీరో ఎలా సరిపోతాడు? అని అనౌన్స్‌మెంట్ రోజు అనుకున్నవారూ లేకపోలేదు. అయితే అనుకోవడం కంటే ప్రయత్నమే గొప్పది. అలాంటి కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా నువ్వేలో తమన్నా హీరోయిన్‌గా నటించడం మరో విశేషం. మరి కల్యాణ్ రామ్, తమన్నాల ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అని తెలియాలంటే ముందుక కథలోకి వెళదాం...
కథ:
వరుణ్(కల్యాణ్ రామ్) అమెరికా వెళ్లాలనుకున్న ప్రతిసారి అతని ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంటుంది. ఓ సారి తను.. ట్రెయిన్ జర్నీలో లవ్ సైన్స్ అనే పుస్తకాన్ని పోగొట్టుకుంటాడు. ఆ పుసక్తం మీరా(తమన్నా)కి దొరుకుతుంది. ఆ పుస్తకాన్ని మరొకరికి మీరా ఇచ్చేసినా.. ఆ పుస్తకం తిరిగి తిరిగి తన వద్దకే చేరుతుంది. దాంతో తనకు, ఆ పుస్తకానికి ఏదో రిలేషన్ ఉందని నమ్ముతుంది. ఆ పుస్తకంలోని వరుణ్ ఫోటోని చూసిన ప్రతిసారీ మీరాకు ఏదో ఒక మంచి జరుగుతూ ఉంటుంది. దాంతో వరుణ్‌ని తన లక్కీ భావించి అతన్ని ప్రేమిస్తుంది మీరా. అదే సమయంలో వరుణ్‌ని మీరా కలిసే ప్రయత్నం చేస్తుంది. వరుణ్ మిస్ అవుతూఉంటాడు. ఓ సమయంలో వరుణ్, మీరాలు కలుసుకుంటారు. మీరా తన ప్రేమను చెప్పి.. విధే తమను కలిపిందని అంటుంది. కానీ విధి అంటే నమ్మకం లేని.. వరుణ్, ఆమె ప్రేమకు, విధికి లింక్ పెడుతూ ఓ పరీక్ష పెడుతుంది. ఇంతకు ఆ పరీక్షలో మీరా గెలుస్తుందా? వరుణ్, మీరాలు కలుస్తారా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
నందమూరి కల్యాణ్ రామ్ లుక్ పరంగా చాలా కొత్తగా ఉన్నాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నింటిలో కొత్తగా కనపడ్డాడు. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న నందమూరి కల్యాణ్ రామ్ మేకోవర్ అందరికీ నచ్చుతుంది. అలాగే తమన్నా గ్లామర్ పరంగా చాలా బావుంది. ఇప్పటి వరకు ఉన్న సినిమాల కంటే తను అందంగా కనపడింది. అలాగే శరత్ సంగీతం, నేపథ్య సంగీతం బావున్నాయి. ముఖ్యంగా ఐఎల్‌యు,.. ప్రేమిక, టైటిల్ సాంగ్ నా నువ్వే.. ట్యూన్స్ బావున్నాయి. అలాగే సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సినిమాకు ప్రధానబలంగా నిలిచింది సినిమాటోగ్రఫీయే.
మైనస్ పాయింట్స్:
ప్రేమకథా చిత్రాల్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ప్రేమకథా చిత్రాలంటే హీరో, హీరోయిన్స్ మధ్య లవ్, అండ్ ఎమోషనల్ బాండింగ్ ఉంటేనే సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. అలాంటి మ్యాజిక్ ఈ సినిమాలో వర్కవుట్ కాలేదు. తమన్నా ఎక్స్‌ప్రెషన్స్ కొన్ని సన్నివేశాల్లో కృతకంగా ఉన్నాయి. అలాగే సినిమా స్లోగా ఉంది. ఆసక్తికరంగా లేని సన్నివేశాలు ప్రేక్షకులకు బోరింగ్‌గా ఉన్నాయి. దర్శకుడు జయేంద్ర ప్రేమకు, విధిగా లింక్ పెడుతూ రాసుకున్న సన్నివేశాలు రక్తికట్టలేదు.
విశ్లేషణ:
ప్రేమ, విధి మధ్య రిలేషన్ ఉంటుంది.. మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి విధితో సంబంధం ఉంటుందనే దానిపై జయేంద్ర ప్రేమకథను అల్లుకున్నాడు. అయితే ప్రేమకథలోని ఫీల్ గుడ్ సినిమాలో మిస్ అయ్యింది. పాటల చిత్రీకరణ చాలా బావుంది. అయితే ప్రేమికుల మధ్య అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలు కృతకంగా ఉన్నాయి. ఏదో మ్యాజిక్ వర్కవుట్ అవుతుందనుకుంటే.. ఏదో ఒకటి అయ్యిందనేలా సినిమా తయారైంది. సినిమా కోసం నందమూరి కల్యాణ్ రామ్ పడ్డ కష్టమంతా వృథా అయ్యింది. నిర్మాణ విలువలు బావున్నాయి.
చివరగా.. నా నువ్వే.. ప్రేమకు, విధికి లింక్ కుదరలేదు
Naa Nuvve Movie Review in English
- Read in English